పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/430

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలియుగఁధర్మములు.

421

నారదుఁడు – శాతాతపా! స్త్రీస్వభావము నీవెఱుంగ కిట్లనుచున్నావు. పరాశరమహర్షియుఁ గొంత ప్రమాదమును బొందుచున్నాఁడు. స్త్రీలకుఁ బునర్వివాహావకాశ మేమాత్ర మిచ్చినను ద్రోహకృత్యములు చేయకమానరు. కావునఁ బూతిన్‌గనే నిషేధింపవలయునని నామతము. దూరముగా నాలోచించినం గాని యందలి యుపకారము దెలియదు.

శంఖలిఖితుఁడు -- పతివ్రతయగు స్త్రీ సహగమనము చేయవలయును. అందుల కొడంబడదేని బ్రహ్మచర్యవ్రతము చేయఁదగును. అదియు జేయలేని యువతి పెండ్లియాడవలయునని నాయభిప్రాయము. వయోవ్యవస్థ దెచ్చిపెట్టిన పరాశరమహాముని యభిప్రాయము కఠినముగా నున్నది. నారదుని మతము లోకసమ్మతముగాలేదు.

నారదుఁడు — మునింద్రా! నీమతము లోకసమ్మతమేకాని యిప్పు డాచరింపఁదగినది కాదు. వర్ణాశ్రమ వివక్ష యున్నంతపర్యంతము నిషేధింపవలయును. బ్రజలు పణన్‌సంకరులై స్వేచ్ఛావిహారముల సంచరింపుచు ధర్మశాస్త్రముల గణింపనేరరు. అప్పుడు విధి నిషేధములు లేకయే ప్రవర్తింతురు.

అని యీరీతి మునులందరు పెద్దతడవు వివాదము గావించిరి. అందు గొన్నినిబంధనములు మార్చిరి. పెక్కండ్రు నారదుని మతములోజేరిరి.

శ్లో. కన్యానామసవర్ణానాం వివాహశ్చద్విజన్మభిః
    విధవాయాం ప్రజోత్పత్తి దేన్‌వరస్యనియోజనం
    బాలాయాక్షతయోన్యాస్తువరేణాన్యేన సంస్కృతిః
    యతేశ్చ సర్వవర్ణేషు భిక్షాచర్యా విధానతః
    పితాపుత్ర వివా దేషు సాక్షిణాం దండకల్పనం
    ఏతానిలోక గుప్త్యర్ధం కలేరాదౌ మహాత్మభిః
    నివతిన్ తాని విద్వద్భిర్వ్యవస్థా పూర్వకం బుధైః