పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/43

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ముగా నాకడకువచ్చి మొఱ్ఱవెట్టుకొనుచున్నది. మేమందఱ మవ్వలఁ బోయెదము సెలవిండనిపలికె ననంతరము పరమేష్ఠి యిట్లుస్తుతించెను.

చ. బళిర! పతివ్రతా ప్రధితభాసురతేజము కాలదారుణా
    నలముగతిం దహించె భువనంబులనన్నిటిఁ జూడుమేల్లవే
    ల్పులకును మాకునుం భయముపుట్టగఁ జేయుచునున్న దయ్యయో!
    తెలిసి యుపేక్షసేయుటిది దేవరకుందగునే రమాధవా!

అని బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు ప్రార్ధించుటయు నారాయణుఁడు నారి కభయహస్తమిచ్చి వారినెల్ల వెంటబెట్టుకొని బ్రహ్మచారి వేషముతో నమ్మహాపతివ్రతయున్న నెలవునకుంబోయి-

సీ. ఉరమునన్ జీవితేశ్వరు శవంబల్లన
              బూని దక్షిణ హస్తమునఁదదీయ
    వీణార్కమాలల వ్రేళులదాల్చి కాం
             త ప్రీతి యోగముద్రను ధరించి
    సారెకుఁ బలిముఖాబ్జము శుభేక్షణములఁ
            గనుచు నద్భుత తేజమున దనర్చి
    వహ్నిశుద్ధంబైన వస్త్రంబు రుచి శర
            త్కౌముదీ రుచిరాంగ శాంతిఁ దెలుప

గీ. పోడశాబ్దవయః పరిస్ఫురిత యౌవ
    నమున నొప్పుచు మణిమండనములతోడ
    మోముదామర దిలకంబు ముద్దుగులుక
    తనరు మాలావతిని గనుంగొనియె శౌరి.

అట్లు చూచి తలయూచుచు నెఱుఁగనివాఁడుంబోలె బ్రహ్మాది దేవతల మీరిందేల వచ్చితిరని పల్కరించుచు మాలావతి నుద్దేశించి యిట్లు వలికెన.