పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/429

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

420

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గౌతముఁడు - ఊఢ యననేమి?

పరాశర - ఒకనిం బెండ్లియాడినది. పరపురుషసంయోగాద్రుతెఊఢాపిదేయా” అని కొంద ఱభిప్రాయ మిచ్చుచున్నారు. ఊఢ యైనను అక్షతయోనియైనచోఁ దిరుగా నివాహము చేయవచ్చును.

శ్లో. నష్టేమృతెప్రవ్రజతే క్లీబేచ పతితె పతౌ
    పంచత్స్వాపత్సునారీణాం పతిరన్యోవిధీయ తే.

ఈయైదువిపత్తులయందు స్త్రీకి బునర్వివాహము చేయవచ్చునని నే నభిప్రాయ మిచ్చితిని.

గౌత --- మీరు రజస్వలానంతరము స్త్రీవివాహము చేయుట కంగీకరింతురా?

పరాశ-- అంగీకరింపము.

శ్లో. అష్టవర్షాభవేద్గౌరీ నవవర్షాతురోహిణీ
    దశవర్షాభవేత్కన్యాత్వత ఊర్ధ్వంరజస్వలా.

కన్యకకు సిగ్గు తెలియకపూర్వమే వివాహము చేయవలయును.

శాతాతపుఁడు — అట్లైన నక్షతయోనియగు స్త్రీకిం బునర్వివాహాము మీరెట్లంగీకరించితిరి?

పరాశరుఁడు - పదియేండ్లు దాటకుండ కన్యక భర్తృవియోగమును బొందెనేని యట్టి కన్యకకుఁ బునర్వివాహము చేయవచ్చునని నే నభిప్రాయమిచ్చెదను.

శాతాతపుఁడు -

శ్లో. వర శ్చేత్కులశీలాభ్యాం నయుజ్యేతకదాచన
    బలా దాహృత్య తాం కన్యాం వుసద్గుణవతె నయేత్ .

ప్రమాదవశంబున వరుని కులశీలాదులం తెలియక కన్యక నిచ్చిన పిమ్మట నతండుదుష్టుం డయ్యెనేని యాకన్యకను బలాత్కారముగా దీసికొనివచ్చి మఱియొక వరునకీయవచ్చునని నేనభిప్రాయమిచ్చితిని,