పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/424

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248 వ మజిలీ.

నారద పంచచూడా సంవాదము.

ఒకనాఁడు నారదమహర్షి స్వర్గలోకమునుండి యెందేని బోవుచుండఁ బంచచూడ యను నప్సరస దారిలో దారసిల్లి నమస్కరించినది. దేవముని దీవించుచుఁ బంచచూడా! నీవు మిక్కిలి చక్కని దానవు. అప్సరఃకుల చూడామణివి. ఎక్కుడుగాఁ జదివితివి. స్త్రీరహస్యములు నెఱింగిన ప్రోడవు. నిన్నొక విషయ మడుగఁ దలంచితిని. దాచక నిజము జెప్పెదవా? అని యడిగిన సప్పడంతి యంజలివట్టి యిట్లనియె.

స్వామీ! మీరు నన్ను సమర్ధురాలనని పొగడితిరి. ఇంతకన్న నాకుఁ గావలసినదేమి! మీరడిగిన విషయము నాయెఱింగినదేయైనచో నెట్టి రహస్యమైనం జెప్పి మీదయకుఁ బాత్రురాల నయ్యెదఁగాక. మీకడనిలిచి మాటాడుట కర్హతలేని నన్ను మీరిట్లు పల్కరించుటచే నేనేకాక మాకులమువా రెల్లఁ బవిత్రమైరని స్తోత్రములుసేసిన విని తలయూచుచు నారదుఁ డిట్లనియె.

పంచచూడా! మఱేమియును గాదు. నీకుఁ దెలిసిన విషయమే యడుగుచున్నాను. స్త్రీస్వభావ మెట్టిదో చెప్పవలయును. నీవెఱుంగని స్త్రీరహస్యము లుండవుగదా. అని యడిగిన నా పంచచూడ యించుక నవ్వుచు నిట్లనియె.

మహాత్మా! నేనాఁడుదాననై నింద్యములైన స్త్రీరహస్యముల మీతో నెట్లు చెప్పుదును? శ్రీ లెట్టివారో యెట్టి కృత్యములు గలవారో సర్వజ్ఞులైన మీరెఱుంగరా? ఆగుట్టు చెప్పుమనుట మీకు