పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/420

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగునికథ.

411

యడిగిన నాబాహ్మణుఁ డిట్లనియె. అయ్యా! నేను ధర్మారణ్యవాసిని. బ్రాహ్మణుఁడ భృగుండనువాఁడ. పద్మనాభుండను సర్పరాజుం జూడవచ్చితిని. కర్షకుండు పర్జన్యోదయమువోలె నేనతనిరాక నిరీక్షించి యతని క్షేమముగోరుచు క్లేశశూన్యమైన యోగ మవలంబించి యున్నవాఁడనని చెప్పిన విని సర్పపతి యిట్లనియె.

అయ్యారే! విప్రోత్తమా! నీవృత్తము కడు కల్యాణమైనది నీ సాధువృత్తి యిట్టిదని కొనియాడఁ జాలను. జగంబంతయు మైత్రిచేఁ జూచుచుంటివి. నేనే యాపద్మనాభుఁడను. నీయునికి విని యిందు వచ్చితిని నీ కేమికావలయునో నా కాజ్ఞాపింపుము. కింకిరుఁడనై యక్కార్యంబు గావించెద. నీకుఁ బ్రియమేదియో తెలుపుము. నీయిచ్చవచ్చినపనికి నియోగింపుము. నీసుగుణములచేఁ గ్రీతుండనైతినని పలికిన విని యావిప్రుం డట్టెలేచి యబ్బురపాటుతోఁ జూచుచు నిట్లనియె.

ఓహో! మహానుభావుఁడవు పద్మనాభుఁడవు నీవేనా ! నీదర్శనమున నేనిప్పుడు కృతకృత్యుండ నైతిని. నీయాదరణవచనములచే మఱియు మురిసితిని. నీవలన నొకవిషయము దెలిసికొనుతలంపుతో వచ్చితిని. ఉత్తమధర్మమేది? నాకు గతి యెట్టిది ? కర్తవ్యమేమి? పరమార్ధమేది. అని నాలో నేను సంతతము చింతించుచుందు. యశోగర్భ కిరణములచేఁ బ్రకాశించుచు నీవు చంద్రునివలె నాకాహ్లాదము గలుగఁజేయుచుంటివి. నాకుఁగలిగిన సందియము దీర్పవలయును.

అది యట్లుండె. నీవు సూర్యరథము నడుపుటకై యరిగితివని వింటి. ఒక నెల యమ్మహాత్మునితోఁ గలిసి తిరిగితివి. ఆజగచ్చక్షువు సమస్తజగములకు నాధారము. అందున్న వాని కన్నిజగములు కనంబడునుగదా అప్పుడీభూలోక మెట్లుండును? సూర్యరథము నడుచు నప్పు డెంతవేగముగా నుండును? విశేషము లేమిగనంబడు నచ్చటి