పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలావతికథ.

29

దడఁబడె దిగ్గజంబులు వితాకుపడెన్ ఫణినేతవేల్పులం
గడఁకశపింపఁ గాంత యుదకంబులచెంతకుఁ జేరునంతలో.

అప్పుడు బ్రహ్మరుద్రేంద్రాది దేవతలా యుపద్రవ మెఱిఁగి శ్రీమన్నా రాయణునికడ కరిగి యిట్లు విన్నవించిరి. అందు ముందు యముండు కరకమలంబులు ముకుళించి తన ప్రభుత్వము నుద్దేశించుచు నిట్లనియె.

సీ. దురితాత్ములైననను మరణకాలమున మీ
               పేరెన్నికొనినంతఁ జేర రాదు
    నరకార్హులై యొప్పినను శంభుపూజ నిం
               చుక చేయవారిఁ జేర్చుకొనరాదు
    కాలంబుమూడినగాని పోయిపతివ్ర
               తలభర్తలను దేరఁ దలఁపరాదు
    బ్రహ్మవ్రాసినయట్టి బ్రదుకు చెల్లినను దా
               పసకుమారులఁజేరి పట్టరాదు

గీ. అరసి మాకున్నయధికార మనుసరించి
    చేయుటయుఁ దప్పులగుచుండఁ జెడ్డయేదొ
    మంచియేదియొ ధర్మసూక్ష్మంబు దెలియ
    సంకటంబయ్యె నిఁక నెట్లు జరుగు ప్రభుత.

మహాత్మా! నే నీ యధికారము సేయజాల. తవంబునకుం బోయేద నిప్పనికి మఱియొకని నియమింపుము, అయ్యయ్యో బ్రహ్మ శాపదగ్ధుండగు నుపబర్హణునిం బట్టికొనుటకు వ్యాధిపుంజంబులం బంపక కాలపురుషు సహాయమిచ్చి మృత్యుకన్యంబంపి రప్పించుకొంటి. నందులకై యలిగి యతనిపత్ని మాలావతి మృత్యుకన్యా కుటుంబముతో నన్ను మఠోద్వాసన జేయుటకు సంకల్పించుకొన్నదఁట, ఈమృత్యుకన్యక యన్నముతినక బెంగపెట్టుకొని సకుటంబ