పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/418

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగునికథ.

409

నాకు వ్రతంబు. వ్రతమధ్యంబునం గుడిచిన మహాపాతకంబు. ఎనిమిదిదినములు దాటిన భుజింతునని సమాధానముజెప్పి వారి ధర్మ సత్కారమున కచ్చెరువందుచు భుజించుట కంగీకరింపలేదు.

పదిదినములు గడచినతోడనే పద్మనాభుండు సూర్యు ననుజ్ఞ బుచ్చుకొని యింటికి వచ్చెను. నాగపత్ని పతికెదురేఁగి పాదంబులఁ గడిగి శిరంబునం జల్లుకొని పీఠంబునఁ గూరుచుండఁబెట్టి విసరుచుండఁ బన్నగపతి సతింజూచి యిట్లనియె. యువతీ! నేను లేనిసమయములో దేవతాతిధిసత్కారములు యథాయోగ్యములుగాఁ జేయుచుంటివా? స్త్రీచాపల్యంబునంగాని మద్వియోగదుఃఖంబునంగాని ధర్మసేతువు చెడఁగొట్టలేదుగద అని యడిగిన నాగపత్ని యిట్లనియె.

ప్రాణేశ్వరా! శిష్యునకు గురుశుశ్రూష విప్రునకు వేదధారణము రాజులకు లోక పాలనము గృహస్థున కతిధిసత్కార మెట్లు నియతములో సతికిఁ బతివ్రతాత్వము పరమధర్మము. మీయట్టి యుత్తముని భార్యనై సద్ధర్మముల నెఱుంగకుందునా? నీవు ధర్మరతుండవని యెఱింగి సన్మార్గ మెట్లు విడుతును? అతిధిసత్కారములఁ యథావిధిం గావింపుచుంటి. - - - - పదిదినములక్రిందట మనయింటికి కొక విప్రుం డతిధిగావచ్చెను. కార్యము చెప్పఁడయ్యె. మిమ్ముఁ జూడవచ్చెనఁట గోమతీసైకతస్థలంబున నిరాహారుండై - - - - వేచియున్నాడు. మీ రాక తనకుఁ దెలియఁ జేయుమని కోరియున్నా డిదియే మీరు లేనప్పుడు జరిగినచర్య. మీరందుఁ బోవుఁడని యెఱింగించిన విని యా యురగపతి యిట్లనియె.

దేవీ! నీవు నన్నెఱుఁగనట్లు పలుకుచుంటివేమి? సురాసురుల కంటె దేవర్షులకంటె సురభివలనం జనించినవారగుట నాగు లధికులని యెఱుంగుము. అట్టి నేను మనుష్యునిం జూడఁబోవలయునా? ఇది మాకు మర్యాదగాదు. నీవువోయినా రాక యతని కే చెప్పుము. ఆతఁడే