పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/414

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగునికథ.

405

చున్నది. నీయుపన్యాసము కడుమాధుర్యముగా నొప్పుటచే వినుటకుఁ దృప్తితీఱకున్నది. నిన్ను మిత్రునిగాఁ దలంచి నిన్నుఁ కొన్నిమాటలడుగఁదలంచితిని. నేను గృహస్థధర్మముల ననుసరించి పుత్రులం గని వేదోక్తకర్మల నాచరింపుచు సాధారణగుణములచేఁ గట్టఁబడి లోక వాసనల నాశ్రయించి సంచరింతును. మఱియు నేనెల్లప్పుడు నాత్మలో నాత్మచేతనే యాలోచించుచుందును. పుత్రాదిఫలాశ్రయమైన నావయసు క్రమంబున సగము గడచినది. ఇప్పుడు పరలోకసంబంధమగు పాథేయమేమని యూలోచింపుచుంటిని. ఈలోకసంభారసముద్రము పారముజేరుటకు ధర్మమయమగు తెప్ప యేదని బుద్ధిని సర్వదా తలంచుచుందును.

మఱియుఁ బుట్టుచుం బెరుగుచుఁ జచ్చుచుండెడి నీప్రజల సంయుజ్యమానవిశేషములఁ జూచిచూచి నామది విశ్రాంతినొందకున్నది. పారలౌకికసుఖంబుల ననుభవింప నిచ్చఁగలిగిన నేనీభోగముల ననుభవించుసమయంబున నామనసు సంతుష్టినొందదు. కావున మహాత్మా! నీబుద్ధిబలమున నాలోచించి యుత్తమమైన ధర్మమేదియో నిరూపించి మంచిమార్గముజూపుమని ప్రార్థించిన నాలించి యాయతిథి యిట్లనియె.

భూసురోత్తమా ! బహుద్వారములుగల స్వర్గమున కేదియుత్తమమార్గమోయని నేనును దలంచుచుందును. ఈవిషయమున మోహముజెందియుంటిని. దీనిం దెలిసికొనుటకే నేను బ్రయత్నించు చున్నాడను. కొందఱు జన్నంబులం బ్రశంసింతురు. గొందఱు గృహస్థధర్మములఁ గొందఱు వానప్రస్థము, కొందఱాత్మజ్ఞానము, కొందఱు గురుశుశ్రూషఁ గొందఱు మౌనంబు గొందఱు మాతాపితృసేవ, కొందఱు అహింస , కొందఱు సత్యంబు, కొందఱు దానంబు, కొందఱు యుద్ధమరణంబు ఆర్జవంబు, అధ్యయనంబు తలయొకరీతిని ప్రశంసింపు చుందురు. ఇట్లు పలువురు పలుతెఱఁగుల మోక్షమార్గము లుప