పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/412

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక నారద సంవాదము.

403

త్నములు చేయుచుందురు. ఎన్నటికిఁ దృప్తిబొందరు. ఐశ్వర్యమత్తుల, మద్యపానమత్తుల, శకులాశ్రయింతురు. కొందఱికష్టములు విమర్శింపకున్నను దొలఁగిపోవును. కొందఱికష్టము లెన్నిప్రయత్నములనైనఁ దొలంగవు. కర్మసంగులయందు ఫలవైషమ్యము జూడఁబడుచున్నది. చూడుము! కొందఱు పల్లకీయెక్కుట గోరుచుండఁ గొందరు పల్లకీ మోయుటయే యుద్యోగముగాఁ బరిగణింతురు. కొందఱు స్త్రీలులేక కొందఱు పురుషులులేక దుఃఖింతురు. కావున నో వ్యాసనందనా! గహసమువంటి సంసారమున మునుంగక నీవు నాయుపన్యాసమును వినుము. నీవు ధర్మాధర్మములు సత్యాసత్యములు విడువుము. దేనిచేత నీవు విడువఁబడుచున్నావో దాని విడువుము. ఇది రహస్యము. మనుష్యలోకము కడుచెడ్డది. ఆదెసం జూడకుమని పలికిన విని శ్రీశుకుఁడు మనస్సులో నాలోచించి అయ్యో! దారాపుత్రాదుల సంగమము మహాక్లేశకరము. విద్యావ్యాసంగము శ్రమకరమైనదే. అల్ప క్లేశలభ్యమగు మార్గ మేదియున్నది? నిశ్చయమైన గతియేది? అని రెండుగడియ లాలోచించి నే నెట్లు మోక్షమును బొందువాఁడ నక్కటావియోగసంకటసాగరమగు నీసంసారమునం బడి తిరగఁజాల. ఎందుఁ బోయినఁ దిరుగా నావర్తము లేదో దానిం గోరుచున్నాను. సర్వసంగములు విడిచి నాకెందు శాశ్వతమైన సుఖముగలుగునో నే నక్కడికిఁ బోవుచున్నాను. కర్తవ్య ముపదేశింపుమని యడిగిన నారదమహర్షి యీయర్ధంబు దేటవడ నొక్క యితిహాసంబు జెప్పెద నాలింపుము.

అని చెప్పునప్పటికి కాలాతీతమగుటయు మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.


___________