పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/411

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

402

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నగువారు తలపెట్టినకార్యములు నిష్ఫలమగుచున్నవి. వట్టిమూఢులు లోకజ్ఞాన మీమియు లేనివారు సర్వకాముములచేఁ దృప్తులగుచున్నారు. ఒకనీచుండు హింసాపరుండై జీవులఁ జంపుచు లోకుల వంచించుచు సుఖించుచుండును.

ఒక్కఁడు నిర్వ్యాపారుఁడై కూర్చున్ననువానినిలక్ష్మి యాశ్రయించును. ఒక్కొకఁ డెంతప్రయత్నముజేసినను దరిద్రుఁడుగానే యుండి కర్మానుగుణ్యమైనఫల మనుభవింపనేరఁడు. ఇందులకు హేతు వేదియో చింతింపుము. ఇందుఁ బురుషునియపరాధ మేమియున్నది ? కొందఱు సంతానకాంక్షులై వ్రతాదులు జేసియుఁ బుత్రులం బడయ లేకున్నారు. కొందఱికి వలదనుచున్నను సంతానాభివృద్ధి గలుగు చున్నది. మఱియు మంచివారికి నీచులు నీచులకు మంచికుమారులు పుట్టుచుందురు. గర్భమందు మూత్రపురీషములుగలవు. తినిన యన్నము జీర్ణమగుచున్నది. రేతస్సు జీర్ణముగాక గర్భముగలుగ జేయుచున్నది. మఱియొక్క విచిత్రము చూడుము. జంతువులకు గర్భధారణమునకుగాని విసర్జమునకుగాని స్వతంత్రమేమైనఁ గలదా. అన్నము లోపలవేయుటయే వాని స్వతంత్రము. తరువాత నేమగునో యెట్లు పోవుచున్నదో వానికిఁ దెలియునా ? కావున మనుష్యులకు స్వతంత్రోద్ధారణమందు సామర్ధ్యము లేదు.

వ్యాధులచే క్షుద్రమృగములవలె వ్యాధులచే మనుష్యులు పీడీంపఁబడుచుందురు. తఱుచు రోగములు ధనికులనే పీడించుచుండును. మృగములకుఁ బక్షులకు నెవ్వఁడు చికిత్సచేయుచున్నాడు? మఱియు మంచిమందులుగల వైద్యులుగూడ రోగపీడితులగుచున్నారు. లోక మీరీతి శోకమోహముల నందుచున్నది. ధనమున నెల్లవారు లోకము నతిక్రమింపవలయునని తలంచుచుందురు. అందులకుఁ దగిన ప్రయ