పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/410

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక నారద సంవాదము.

401

విద్యచే మనోవాక్కులను గాపాడుకొనవలయును.

అధ్యాత్మరతుండై కూర్చుండి నిరపేక్షుండై నిరామిషుండై యొప్పు పురుషుఁడు తన బుద్ధిసహాయమువలన దుఃఖములఁ బాసి సుఖించునని యెరింగించి నారదుండు వెండియు నిట్లనియె

మునీంద్రా! సుఖదుఃఖములయొక్క విపర్యాసములు గలిగినప్పుడు ప్రజ్ఞాయుక్తుండుగూడ ధైర్యము నిలుపుకొనఁజాలఁడు. కాని యట్టి ప్రయత్నము స్వభావముచేతనే చేయుచుండవలయును. యత్నముగలవాఁడు దుఃఖింపఁడు. జరామరణరోగముల వలన తన్నుద్ధరించుకొనవలయును. శరీరములు రోగయుక్తములు గదా. శారీర మానసికములగు రోగములు (ఆదివ్యాధులు) ధన్వులచేఁ బ్రయోగింపఁబడిన బాణములవలెఁ జీవుల బాధించుచుండును. రోగములచేఁ బీడింపఁబడుచుఁ జీవితాశగలిగి యవశుండగు వాని దేహము వినాశనమునకై మృత్యువుచేలాగఁబడుచున్నది. జరాజీర్ణమై జారినదేహము నదీప్రవాహమువలె వెనకకు మరలదు. (తిరుగా పడుచుఁదనము పొంద నేరదు).

రాత్రింబవళ్ళు మనుష్యుల యాయువుల హరించుచున్నవి. శుక్లకృష్ణపక్షములు వృద్ధులఁ జేయుచున్నవి. కాలము నిమిషమైనను నిలువదు. ముదిమిరాకున్నను సుఖదుఃఖములు మనుష్యుల వృద్ధులఁ జేయుచున్నవి.

సూర్యుఁ డస్తమించుచు నుదయించుచు ననేకవిచిత్రభావములఁ గల్పించుచుండును. పురుషకృత్యములగు పనులయొక్క ఫలవిషయమై పరాధీనముకాక స్వతంత్రమే కలిగినచో నెవ్వఁ డేది తలంచి చేయునో యకార్యము తప్పక సఫలముకావలసినదేకదా. అట్లగు చున్నదా. ఒకసారి లోకముదెసఁ జూడుము. దక్షులు బుద్ధిమంతులు