పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/409

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

400

కాశీమజిలీకథలు - పదియవభాగము.

జనాప్తి, సర్వము నధ్రువమని యెఱిఁగిన వానికిఁ దద్వియోగంబున శోకము జనింపదు. జనసంఘమువలన వచ్చిన శోకము తానొక్కఁడే యనుభవింపవలదు. దుఃఖింపకయే ప్రతీకారము తెలిసికొని కావింప వచ్చును. లోకమున జీవులకు సుఖముకంటె దుఃఖమే విస్తారముగా నుండును. ఇంద్రియార్ధములయందు స్నిగ్ధత్వము మోహమువలన మరణంబు గలుగుచున్నది. సుఖదుఃఖములు రెండును విడిచినవాఁడె యుత్తముఁడు. వయసు నడుచుచు నిమిషము నిలువదుగదా. శరీరమే యనిత్యమగుచుండఁ డత్సంబంధములు నిత్యము లెట్లగును. కష్టము మీఁద నర్ధములను విడుతురు. తత్పాలనకై సుఖములఁ గోల్పోవుదురు. ధనాభివృద్ధి వడసియుఁ దృప్తిలేక సంపాదనపరుండగును. తృప్తిలేనివారు దుఃఖమునే పొందుదురు. తృప్తిగలవాఁడే సుఖముగల వాఁడు. సముఛ్రయములు పతనాంతములు. వియోగాంతములు సంయోగములు. మరణాంతములు జీవితములు. భూతముల యనిత్యత యెఱింగినవా రెప్పుడును దేనికిని శోకింపరు. విద్వాంసులు సంతోషమే ధనముగాఁ జూతురు. కామములఁ దృప్తిబొందక వానిని గుఱించి విచారించుచుఁ దదనుగుణములగు కార్యములఁ జేయుచున్న మూఢునిఁ బెద్దపులి పశువుంబట్టినట్టు మృత్యుదేవత పైఁబడి యీడ్చి కొనిపోవును. కావున దుఃఖమోచనమునకై యుపాయ మాలోచించు కొనవలయును. ఆలోచింపక యేకార్యము ప్రారంభింపఁగూడదు.

ధనికుఁడైనను దరిద్రుడైనను శబ్దస్పశన్ రూపరస గంధముల ననుభవించుటకంటె వేరులేదుగదా ? అంతకుమున్ను దుఃఖములేదు. భూతసంమేళనపూర్వమును దుఃఖములేదు. తాను బుట్టకపూర్వ మేమియును లేదు. తరువాత వచ్చిపోయినవానిగుఱించి పరితపించుట తెలిసికొనమిఁగాదే. పూర్వవృత్తాంతము దలంచికొనిన నాదు:ఖము నిలువదు. ధైర్యముచే శిశ్నోదరములను మనన్సుచేత చక్షుశ్రోత్రములను