పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/407

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ధర్మాధర్మముల విడువుము. సత్యాసత్యములవదలుము. వాని వదిలిసపిమ్మట నీవు దేనిచేత విడువఁబడుచున్నావో దానిఁగూడవదలి వేయుము, సంకల్పశూన్యుడవై, ధర్మంబును అలిప్సచే నధర్మమును విడువుము. మంచిబుద్ధిచే సత్యానృతముల విడువుము. పరమ నిశ్చయమువలన బుద్ధిని విడువుము. మఱియు నెముకలచేఁ గట్టఁబడినది, న్నాయువుతోఁ గూడికొన్నది, మాంసశోణితములచేఁ బూయఁబడినది, చర్మముచే గప్పఁబడినది, మూత్రపురీషములఁచేఁ బూరింపఁబడినది, జరారోగములచే బీడింపఁబడునది యనిత్యమైనది ఇట్టి భూతావాసమును శరీరమును నమ్మియుండకుమీ.

పుత్రా! ఈకనంబడుచున్న పంచభూతాత్మకమగు జగంబంతయు మహత్తని చెప్పఁబడుచున్నది. ధర్మాధర్మములను, సుఖదుఃఖములను, జీవితమరణములను, ఎవ్వఁడుఁ తెలిసికొనుచున్నాడో వాఁడే తెలిసిన వాఁడు, జ్ఞానవంతుఁడుసుఖదుఃఖములంబారంపర్యముగావచ్చునని యెఱింగి శోకమోహముల నందఁడు, ఇంద్రియముచేత హింసింపఁబడునది వ్యక్తమనియు, నతీంద్రియమైనది యవ్యక్తమనియుఁ జెప్పఁబడుచున్నది. ఇంద్రియముల జయించిన దేహియుదకపానంబునంబోలె దృప్తుం డగును. లోకమందుఁ దన్నును దనయందు లోకమును జూచుచుండెడి పరాపరజ్ఞుని శక్తి జ్ఞానమూలకమగుట నెన్నఁడు నశింపదు. మోహజములైన వివిధక్లేశములను జ్ఞానముచేత జయించుచున్నాఁడు. భూతములయొక్క సంయోగము కారణము లేక రానేరదు. బుద్ధిప్రకాశత చేత లోకమార్గము దెలియఁబడుచున్నది.

జీవి స్వకృతములగు కర్మలచేత నిత్యదుఃఖితుండై తద్దుఃఖ నివారణముకై నిత్యము ననేకజంతువుల హింసించుచుఁ దిరిగి క్రొత్త కర్మలం చేయుచుండును. అసథ్యముజేసిన రోగివలెఁ దానుజేసిన కర్మఫలము తాననుభవింపుచుఁ దపించుచుండును. మోహాంధుండై