పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/405

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ములవలన విద్యను, ప్రమాదమువలనఁ దన్నును రక్షించుకొనుచుండ వలయును. ఏభూతమునకు ఘాతుకత్వము దలంపకపోవుటయే యుత్తమధర్మము. అంతకన్న క్షమ యుత్తమమైనది. అంతకన్న నాత్మ జ్ఞానము శ్రేష్ఠము. దానికంటె సత్య మెక్కుడిది. దానికంటె సర్వ భూతహితముగాఁ బలుకుట మంచిది. భూతహితము గోరుటయె సత్యమని నామతము.

సర్వారంభముల విడిచినవాఁడును, ఆశాశూన్యుఁడును, బరిగ్రహరహితుండును, ఉత్తముఁడని చెప్పుదురు. ఎవనిచేత సర్వము విడువఁబడినదియో వాఁడే విద్వాంసు డనఁబడును. ఎవ్వఁడు నిర్వికారుఁడై యింద్రియముల వశముజేసికొని యింద్రియార్ధములతోఁగూడ నీయక చరించునో యతం డుత్తముఁడందురు. భూతములదెస జూడక పోవుట, నంటకపోవుట, మాటాడకపోవుట, పరమ శ్రేయము. సర్వ భూతములయందు మైత్రిగలిగివర్తింవుము. శరీరియెవ్వరితోడను వైరము చేయఁగూడదు. జితేంద్రియుండగు నాత్మవేత్తకు దరిద్రమే సంతోషము పరిగ్రహమును విడిచి జితేంద్రియుఁడవగుము. తా తా ! శోక శూన్యమగు స్థానము నాశ్రయింపుము. ఇహపరములయందు భయరహితుఁడ వగుదువు. నీకుసంగమునం దిష్టమున్న చోఁ దపోనిత్యుఁడు దాంతుఁడు నగు వానితో సహవాసముచేయుము. గుణసంగులతో నెన్నఁడును బరిచయము చేసికొనకుము. ఏకచర్యారతుఁడవు కమ్ము,

సుఖదుఃఖములకు నారామములగుభూతములయందు నొక్కండే క్రీడించును. అట్టివాఁడు జ్ఞానతృప్తుఁ డనంబడును. జ్ఞానతృప్తుఁ డెన్నఁడును దు:ఖింపఁడు. కేవల సుఖములచే దేవత్వమును బొందు చున్నాఁడు. మిశ్రమ సుఖములచే మనుష్యుఁ డగుచున్నాడు. అశుభములచే నథోగతిఁ బొందుచున్నాఁడు. మనుష్యజన్మమునందు జరామృత్యదుఃఖములచే సర్వదా తొట్రుపడుచు నీసంసారమున మునింగి