పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/395

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గీ. సాధ్వి నీయట్టినతి యెన్ని జన్మములకు
    నైన దొరకునె తలక్రిందుగాను నిలిచి
    తపముజేసినగాని సీ! తలఁచిచూడ
    వట్టి నిర్భాగ్యుఁడైతిఁ జివరకు నేను.

అని యమ్మహారాజు సౌభాగ్యసుందరి తనకడకు వచ్చినది మొదలు నాఁటి తుదివఱకు జరిపిన చర్యలన్నియు నుగ్గడించి దుఃఖించుచు నా సరోవరములోఁదిగి వెదకుచుండ నాలించి నారదుండు అచ్చర్యలెల్లఁదాను గావించినవిగా నెఱింగియు నేమియుందోచక యూరక చూచుచుండె నప్పుడు శ్రీవిష్ణుం డాభూపాలుఁ దాపునకు రమ్మని చీరి సమీపించినంత,

నీ వెవ్వఁడవు ? ఎవ్వరి కొఱ కిట్లు విలపించు చుంటివి ? ఆతటాకములో వెదకుచుంటి వేమి పోయినది? అని యడిగిన నాభూనేత తన కథయంతయుం జెప్పి నాకళ్యాణరాశి నాసౌభాగ్యసుందరి నాజీవితేశ్వరి, యీతటాకములో మునిఁగి తిరుగా లేచినదికాదు. జలజంతువు లేవియో మ్రింగినవి. ఆయొప్పులకుప్ప నందు వెదకుచుంటి తండ్రీ! మీకుఁ జూలపుణ్యమురాఁగలదు. అందులకు సహాయము జేయుదు రే. అని వేడికొనిన నవ్వుచు ముకుందుం డిట్లనియె.

నీటిలో మునింగినవా రింతసేపు జీవింతురా? నీభార్య మకర గ్రస్తయై పరలోకమున కఱిగినది. ఎంత విలపించినను నీకాంత రానేరదు. వగపు నిరర్ధకము. మూఢుండవై యేల విలపించెదవు? ఇంటికిం బొమ్మని పలికిన విని తాళధ్వజుం డిట్లనియె.

అయ్యయ్యో! నాభార్య లోకము పరిపాటిబోటికాదు. తండ్రీ! ఆసుగుణములు, ఆప్రేమ, ఆయనురాగము ఇట్టిదని చెప్పఁజాలను. కుటుంబమంతయు నశించినను నాయిల్లాలు బ్రతికి యున్న నేనిట్లు విల