పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/392

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

383

వమంతయు గడియలో స్వప్న ప్రాయమైనది. అని పెద్ద యెలుంగున రోదనము గావించినది.

వృద్ధ --కోమలీ! నీవు శోకముడిగి నామాటవింటివేని జెప్పెద. లేకున్న నాదారింబోయెద. నామాటలకు సమాధానముజెప్పుము.

సౌభా — చిత్తము. మహాత్మా. చిత్తము.

వృద్ధ - నీవారాజుం బెండ్లియాడకపూర్వ మీసంతతియంతయునున్నదియా?

సౌభౌ -- ఎవ్వరులేరు స్వామి! పెండ్లియాడిన తరువాతనే యీకుటంబమువృద్ధియైనది. గడియలో నాశనమయినది. అని శోకించినది.

వృద్ధ - మొదటలేదు నడుమవచ్చినది. చివరపోయినది. ఇందులకు వగచెద వేమిటికి? సంసారము మోహజనకము క్షణభంగురమని తెలియదా? వీరికి నీ వేమగుదువు. వీరు నీ కేమగుదురు? ఎట్టి సంబంధము? గర్భవాస సంబంధము. వారికి నీవంటి తల్లిలెందరైరో? నీవిదివఱ కెందరకుఁ దల్లివైతివో! అందఱికొఱకు నిట్లుదుఃఖించుచుందువా? ఈచక్ర మిట్లు తుది మొదలులేక గడియారమువలెఁ దిరుగుచునే యుండును. నీవు పుత్రోదయము సుఖమని మురిసితివి. ఆమురిపెమే యీవెఱపునకుఁ గారణమైనది. అదియే లేనిచో నిదియును లేకపోయెడిదే సంసారమాయామార్గ మిట్టిదని తెలిసికొనుము. ఏడవకుము. లెమ్ము. లోకమంతయు నస్థిరమని యెఱింగిన శోకముండునా? ఇంతయేల? నీమాట చెప్పుము. ముందరిక్షణమున నీవెట్లుందువో తెలియునా? సంసార ప్రవాహంబునఁ బుద్బుదములవలె గొట్టి కొనిపోవుచు దేహులు మోహావేశచిత్తులై దుఃఖసముద్రంబునం బడిపోవుదురుగదా! కావున విలపించిన ప్రయోజనము లేదు. . లెమ్ము. అదియ పుణ్యసరోవరము. అందు స్నానమాచరించిన మనోమలంబు