పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/390

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

381

    హము లెట్లున్నవొ చూతుగాక కని దేహత్యాగముంజేసి స్వ
    ర్గమునం దాప్తులఁగూడికొందము విచారంబేల నింకీయెడన్.

అని పలుకుచు భార్య చేయిపట్టికొని తాళధ్వజుండు యుద్ధభూమికిఁ దీసికొనిపోయెను. సౌభాగ్యసుందరి యందు నరకఁబడిన కాళ్లతో దెగిన చేతులతో మొండితల మొండి కళేబరముల గల పుత్ర బౌత్రాదుల గాత్రములఁగా కగృధ్రములు పొడిచి పీకుచుండఁ జూచి గుండెలు బాదుకొనుచుఁ భర్తతోఁగూడ నాశవములమీఁదఁబడి,

సీ. అయ్యయ్యో శ్రీముఖుండా వీఁడు కటకటా
                 కమలాంచితాస్య తేజము నశించె
    సౌమ్యుఁడా వీఁడయో చారుగాత్రమువాసె
                 గుందమాలాభి యుక్తుండుగామి
    చిత్రభానుఁడె వీఁడు శివశివా గాత్రముల్
                 కడముట్టె వారుణీకలనబాసి
    పుష్ప కేతుఁడె వీఁడు పోల్చంగ విగత ర
                త్నమకుటుండగుట ఖేదముఘటించె

గీ. ఖండితావయవములగు మొండెములఁ గ
    నంగ గుండెలుపగిలెఁ బుత్రాంగకముల
    గాక గృధములీడ్వంగఁ గనియు నిట్లు
    బ్రతికియుంటిని నావంటి పడఁతి గలదె.

అయ్యయ్యో! నాకుమారులు హంసతూలికా తల్పంబులఁ బండికొనియు నొఱయునని పలుకుచుందు రట్టి ముద్దుకుఱ్ఱల యవయవము లిట్లు ఖండితంబులై జంబుకంబులు దినుచుండఁ జూచియు మేనం బ్రాణంబులు దాల్చియుంటి నావంటి మొండికత్తె యెందై నగలదా ! ఛీ ! నేనొక ప్రేమగలదాననే. ఔరా! ఎంతలోఁ గాలము మారి పోయినది. నేఁటి యుదయకాలముననే కాదా కోడండ్ర తగవులు .