పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/389

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సౌభాగ్యసుందరి కొంతసేపటికి మేను దెలిసి యట్టె లేచి నలు దెసలం బరికింపుచు దాపున నెర్విరింగానక కొంతపరిక్రమించి శవా క్రాంతములైయున్న ప్రాంగణ భూముల జూచి గతాసులైన కోడండ్ర మనుమలఁ బౌత్రికల దాసదాసీ జనంబులం జూచిచూచి గుండెలు బాదుకొనుచుఁ బెద్ద యెలుంగున నాక్రోశింపుచు నావాకళులన్నియు దిరిగి తిరిగి యొక్కొక్క కోడలింజూచి తచ్ఛర్యల స్మరించుకొనుచు దుఃఖంప నోదార్చుటకు నొక్కరైనను మిగులలైరిగదా! అప్పుడామె చిత్తవృత్తి యెట్లుండునో చెప్ప నెవ్వరితరము?

తన పతికూడ సహితునిచే మృతినొందింపఁబడెనని నిశ్చయించి యాసాధ్వీమణి శో కావేశమునఁ గర్తవ్యమెఱుఁగక యున్మత్తవోలె నాకోటలో నొక్కరితయుఁ దిరుగ జొచ్చినది. అంతలో నొక మూల నుండి తాళధ్వజుండు రక్కల దాడికోడి పారిపోయి వారూరువిడిచి చనిన తరువాత మఱల రణావని కరుదెంచి యందుఁ జచ్చిపడియున్న కొడుకుల మనుమల శవములపైఁబడి యేడ్చి యేడ్చి కోటలోనివా రెట్లుండిరో యని తెలిసికొనుటకై యాప్రాంతమున కరుదెంచుటయు సౌభాగ్యసుందరి భర్తం గాంచి యతనిపయింబడి గోలు గోలున నేడ్చుచుఁ బాణేశ్వరా ! నాపుత్రులేరీ ? ఒంటిగా వచ్చితిరేల ? పిల్ల వాండ్ర యుద్ధభూమిలో విడిచివత్తురా ? మీకక్కటికములేదా ! అని పిచ్చిదానివలె నడుగుటయు నతం డాయెలనాగం గౌగలించుకొని.

క. ఎక్కడి పుత్రకులయయో
    ఎక్కడి పౌత్రకులు మానినీ! దుర్మతియా
    రక్కసుఁడు మడియ జేసెను
    నొక్కకొడుకునైన మిగులకుండఁగ నకటా!

మ. ప్రమదా! యేమని చెప్పువాఁడ మన మాపద్వార్థిలో మున్గినా
     రము దిక్కెవ్వరులేరు కాచుటకు రారమ్మందు నీపుత్రదే