పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/387

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సీ. పారిపోయెడువారిఁబట్టి పొట్టలుచీల్చి
                రక్తంబు గ్రోలు ఘోరముగ నొకఁడు
    ఇండ్లలోదూఱి పూఁబోండ్ల దాసీదాన
                జనము లెంపలుకొట్టి చంపునొకఁడు
    శిశువుల నురమునఁ జేర్చి మూలలడాగి
               కొనువారి యీడ్చి చే దునుమునొకఁడు
    వెఱచి వే యుఱుకు బాలుర నెత్తిచఱచి మొ
              ఱ్ఱోయనం జక్కాడు నొక్కరుండు

గీ. డొక్కలూడగ వృద్ధుల ద్రొక్కునొకఁడు
   నల్లులనువోలె శిశువుల నలుపు నొకఁడు
   పసులఁ బులివోలె గొంతుకల్ పిసుగునొకఁడు
   ఊరిపైఁబడి రక్కసు లుక్కుమీఱ.

పాతాళకేతుఁడు రాక్షసబలములతోఁగూడ నావీటి పయింబడి మారిమెసంగినట్లు కనబడిన జంతువు పశుపక్షిమృగాదుల మనుష్యుల స్త్రీల వృద్ధుల బాలుర శిశువులఁబట్టికొని మొఱ్ఱోయని యఱవ మ్రింగుచుఁ జఱుముచు బ్రాముచుఁ బొడుచుచు ఆఁడుచుఁ ద్రొక్కుచుఁ బ్రజాక్షయము గావింపుచు నమ్మా! తండ్రీ! పుత్రా! మామా! అని యాక్రోశించుచు గుంపులుగాఁ బారిపోవు జనంబులఁ దరిమి పట్టుకొని ప్రోగులుగా సంహరించుచుఁ ప్రళయకాలంబోయని యెల్లరు తలంప రెండుయామయముల లో నానగరమంతయు మునుము వెట్టి శూన్యముగావించెను.

ఆరక్కసుఁ డుక్కుమిగిలి పోరనరిగిన రాజుకుటుంబమునంతయు సమస్త సేనలతోఁగూడ నాశనముచేయుటయే కాక పట్టణమునందలి పశుపక్షి మృగాదుల మనుష్యుల నాబాలవృద్ధముగా భక్షించుచు వచ్చుచున్నాడను వార్త విని సౌభాగ్యసుందరి హాహాకారరవము