పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/385

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బారి బడకుండఁ దప్పించుకొని వచ్చి యిప్పుడే యావార్త చెప్పినాడని యెఱింగించిన జడియుచు నప్పడఁతి యిట్లనియె.

ప్రాణేశ్వరా! బిడ్డలందఱు నింటియొద్ద నున్నారా! ఈవార్త విన్నారా? విని యేమనిరి? అని యడిగిన నతండు విన్నారు. ఈలాటి నిశాటుల నెందరినో బరిమార్చితిమని బీరములు వల్కుచున్నారు. వాఁడిందు వచ్చుచున్నాడని తరువాతి వార్తవినికవచాదిసాధనముల ధరించి యుద్ధసన్నద్ధులగు చున్నారని పలుకుచుండగనే యక్కు మార శేఖరు లిరువదిమందియు వీర వేషములతో నచ్చటి కరుదెంచి తల్లికి నమస్కరించిరి.

ఆమె వారి నందరం దీవించుచు బిడ్డలారా! ఆరాక్షసుఁ డెక్కడనో యుండఁగనే యోధవేషము దాల్చితిరేల? మన గ్రామమునకు వత్తురని నిశ్చయించితిరా? అనియడిగిన వారు తల్లీ! వాఁడు కామరూపుఁడు ఎగురఁగలడు. మన నగరమునకు గ్రోశదూరములో నున్నట్లు తెలిసినది. సేనల నంపితిమి. గుఱ్ఱము లెక్కి. మేము వోవుదుము. వీఁడన నెంత? వీని తాతలవంటి రక్కసుల పీచమడంచితిమి. నీవు జింతింపకుము. విజయమగునట్లు మా కాశీర్వదింపుము. నీ కోడండ్రు జడియుచుందురు. అదటుడిపి యుదుటు గరపుచుండు మని పలికినవిని యాయిల్లా లిట్లనియె.

బిడ్డలారా! నామది నేదియో యదటు గలుగుచున్నది. మీ రిప్పుడు యుద్ధమునకు బోవలదు. శత్రువుల బలాబలంబులు విచారింపఁవలయుంగాదే యనుటయు నవ్వుచు వీరవర్మ తమ్ములారా! అమ్మ మన పరాక్రమ మెఱుంగదు. వగచుచున్నది. నేనొక్కరుండపోయి వాని యుక్కడంచి వచ్చెద. మీ రిందుండుండని పలికిన నామె సరిసరి. నీవొక్కరుఁడవు పోవరాదు. తమ్ములతోఁ బొమ్ము. జాగరూకులై పోరొనరింపుఁడని పలుకుచు నెట్టకేలకు వారి సంపినది.