పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/376

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

367

వచ్చి గృహములలోఁ బ్రవేశింపుండని ధసకోటి యావీధిని జాటింపఁ జేసెను. ఆరక్కసుండు గావించిన హత్యలును పౌరులకుఁ గలిగిన యపాయములునెఱింగించుచు నన్నుస్తుతియించుచు నా రాత్రి శేషంబు వెళ్ళించిరి. ఆమఱునాఁడు పౌరులెల్ల నాబాలవృద్ధముగా దేవునిఁజూడ వచ్చినట్లు పలహారములతో వచ్చి చూచి నన్నర్చించి పోవుచుండిరి. ఆమోహిని నన్నుఁ బతిగాఁ బడయఁగోరి తన యభిలాష తలిదండ్రుల కెఱింగించినది.

ధనకోటి నన్నుం బ్రార్థించి మఱునాఁడే తనకూఁతు నాకిచ్చి మహావైభవముతో, వివాహము గావించెను. మాసోదరులీ యూర నున్నారు. వారిని రప్పింపవలయునని చెప్పుటకు నాకు బుద్ధిపుట్టినది కాదు. ఆవీధివారెల్ల నాపెండ్లికి బంధువులవలె వచ్చి పరిజనులవలె నుపచారములుసేసి బట్టులవలెఁ బొగడుచు దేవునివలెఁ బూజించిరి.

అమహోత్సవములతో నెనిమిదిదినములు గడియవలె వెళ్లించితిని. ఈనగరి యవ్వలివీధిలో నెవ్వరో పెండ్లివారు పోట్లాడుచున్నారని వింతగాఁ జెప్పికొనఁగా నలువురతో నేనా వీధికి బోయితిని. అందు మన సోదరుఁడు గుఱ్ఱమ పై నిలువంబడి మీతోఁ గయ్యము సేయఁ గాలుద్రువ్వుచుండెను. అతండు నన్ను గురుతుపట్టి తనతోఁ గలుపుకొనియెను. తరువాతి కథ మీఱెఱింగినదియే. ఇదియే నా వృత్తాంతమని యెఱింగించిన విని పుష్ప కేతుఁ డిట్లనియె.

ఔరా ! మనచరిత్రములు విచిత్రములుగా నున్నవి. ఒక నగరంబున వసించియుఁ దలయొక దేశమున నున్నట్లు వ్యవహరించితిమి. అవ్వలివీధి నెవ్వఁడో యొక వీరుండు రక్కసుం బరిమార్చెనని చెప్పి కొనగా వింటి. నీవని తెలిసికొనలేక పోయితిని. ఈపట్టణము చాల పెద్దదగుట నెన్ని విశేషములైనం గలిగియున్నది. భూమండలమున నింత పెద్ద పట్టణము జూచియుండలేదు. స్త్రీ రాజ్యభాగమంతయు