పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/375

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

కాశీమజిలీకథలు - పదియవభాగము.

దొర్లుచుండ దండకుఁబోయి రెండుచేతుల మండలాగ్రం బెత్తి గొడ్డలి చేతంబోలె నాభీలగతి వాని కంఠంబు ఖండించి మొండెమును గావించితిని.

ఆదంపతులును బుత్రికయు నాపోరాటము వానిపాటుంజూచి యాశ్చర్య సంతోషములతో నాకడకువచ్చి పాదంబులంబడి మహాత్మా నీవు దేవుఁడవు కాని మనుష్యుండవుకావు. సామాన్యమానవుం డింత చులకనగా నీదానవుం బరిమార్పఁగలడా ? నీకతంబునమేము మువ్వు రము బ్రతికితిమి. నీవడ్డుపడుకున్న నీపాటికి జము వీటికిం జేరవలసిన వారమే. మేమేకాదు. ఈనగరవాసులకెల్ల మహోపకార మొనరించినవాడ వైతివి. ప్రతిసంవత్సరము వీఁడేవీధికో వచ్చి యందలి ప్రజలం జంపి శూన్యము చేయుచుండువాఁడు. బకుని జంపి యేకచక్రపురవాసులం గాపాడిన భీమునివలె నీ వీ పట్టణ ప్రజల రక్షించితివి ఈనగర మాఁడుది పాలించుచున్నది. ఇందులకుఁ బ్రతీకార మామె యేమియు నాలోచింపలేకపోయినది. అని వారు నన్ను బొగడు చుండఁగనే యందు మిగిలినయున్న వారెల్ల నావార్త విని మూఁగికొని పూవులచే నన్నుఁ బూజింపఁ దొడంగిరి.

ఆయజమానుని పేరు ధనకోటియఁట. పదికోట్ల దీనారముల కధికారియఁట. అతని కూఁతురు పేరు జగన్మోహిని. పేరునకు మించిన సౌందర్యము కలిగియున్నది. అట్టి భాగ్యవంతుఁ డెక్కడనున్న వస్తువు లక్కడ విడిచి ప్రాణములు దక్కించుకొనుటకై భార్యాపుత్రికలతో నిల్లువెడలి పోవుచుండ నొక్క పరిజనుండైన వెంటరాడయ్యె. ప్రాణములకన్న దీపైనవస్తువు లేదుగదా. ధనకోటి తనవృత్తాంతము నాకెఱింగించి నన్ను సగౌరవముగాఁ దనయింటికి రమ్మని ప్రార్థించి తీసికొనిపోయెను.

మాయల్లుం డారక్కసుం బరిమార్చెను పౌరులు నిర్భయముగా