పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/374

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

365

టుంబమువారు బాబూ ! వాఁడు సామన్యుఁడు కాడు. మనుష్యులు వాని నెదిరింపఁజాలరు. ఏచాటుననో దాగికొందము రమ్ము. అని చీరుచుండ నవ్వుచు మీరు నిర్భయముగా నాయరుగుపయిం గూరుచుండుడు. గడియలో నాయసురుని మడియజేసెదనని పలుకుచుండఁ ప్రచండదోర్దండంబుల సాచి పారిపోవు మనుష్యులం బట్టికొని పొట్టలంద్రొక్కి విరిచి దంష్ట్రాకరాళంబగు నోటం బడవైచుచు నారా త్రించరుండు మేమున్న తావున కరుదెంచెను.

వానింజూచి యరుగుమీఁద నున్న వారు అమ్మయ్యో! చచ్చితిమి. చచ్చితిమి. వాఁడిందే వచ్చియున్నాఁడని పెద్ద యెలుంగున నేడువందొడంగిరి. వాఁడు ఎదురునున్న నన్నుఁజూడక యేడుచుచున్న యాకుటుంబము మీఁదికిఁబోవ నుంకించుటయు నే నప్పు డడ్డంబై మండలాగ్రంబు గిరగిర ద్రిప్పుచు క్రూరాత్మా! నేనిందుండ వారిపయిం బడెదవేల? రమ్ము. రమ్ము. ఇదియే మదీయ కృపాణహారము కాచికొనుము. నీయాయువు మూడియే యిందువచ్చితివని పలికినంత గుహాసదృశంబగు వదనంబు దెరచికొని యగ్నిజ్వాలవలె నాలుక వ్రేలాడుచుండ నారక్కసుం డుక్కుమీర నాపై లంఘించెను.

అప్పటి నాసాహసము తలంచికొనిన నా కే యాశ్చర్యము గలిగించినది. అట్టిబలము నా కెట్లు వచ్చినదో తెలియదు. వాఁడు నన్ను జేఁతులతో బట్టుకొనబోవునంతలో మండలాగ్రంబెత్తి ప్రచండవేగంబున వేసితిని. ఆవ్రేటుతో వాని నాలుక సగమును కరతలంబులుం దెగి నేలంబడినవి.

అప్పుడు వాఁడు వెల్లువగ రక్తముగారుచుండ వికృతస్వరంబున నార్చుచు మొండిచేతులతో నేదియుఁ బట్టికొనంజాలక గింజుకొనుచు జిందులుద్రొక్క నొక్కవ్రేటున వాటముగా వానిరెండు పాదంబులుం దెగనఱికితిని. వాఁడు కొండవలె నేలంగూలి భీషణఘోషముతో