పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/371

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

362

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రొదజేయుచు అన్నా ! తమ్ముడా! అమ్మా! తండ్రి! బాబూ!అమ్మా యీ! పట్టీ! రండు రండు వేగరండు అని హాహాకారరవంబులతో నొండొరులం జీరికొనుచు గాలుచున్న యిండ్లనుండివలెనే యీవలకు వచ్చి వీధింబడి యెక్కడికో పారిపోవుచుండిరి. అమ్మా! యని యేడ్చుచు వెనుకవచ్చు పిల్లలనైనఁ జూడకఁ నాధా, నిలు, నిలుమని పిలుచు భార్యనై నం బరిశీలింపక పట్టీ! మమ్ముఁ దీసికొని పోవా? అని కేకలుపెట్టు తలిదండ్రులవంకం జూడక యాడు వాండ్రు మగవాండ్రొండొరులం బల్కరించుకొనక శక్తికొలఁది పరుగిడుచున్న యాపౌరులంజూచి నేనందలి కారణంబు దెలియక అయ్యా! ఇప్పుడువచ్చిన యుపద్రవమేమి? అందఱు నిట్లు పారిపోవుచున్నా రెక్కడికి? చెప్పుఁడని యడిగిన నెవ్వరు నుత్తరము చెప్పినవారు లేరు.

నేనుగూడ వారితోఁ బోవుచుఁ గనంబడినవారినెల్ల గారణం బడుగుచుండ నొక్కఁ డయ్యో! నీవు గ్రొత్తవాఁడవు కాఁబోలు. భూమి పగులుచున్నది. ఇందు నిలువరాదు అని మాత్రము చెప్పి పరుగెత్తికొని పోవుచుండెను.

అతని మాట నాకేమియుఁ దెలిసినదికాదు. భూమి యెక్కడపగిలినది? పగిలిననేమి? యని ప్రవాహమువలెఁ బోవుచున్న పౌరుల నడుగుచు నేనొకచో నిలువంబడితిని. నిలిచితి వేల పదము. భూమి ! యెక్కడనో పగులును. ధ్వని వినంబడుచున్నది. అవ్వలివీధికినిబోయినఁ బ్రమాదము దప్పునని యొకఁడు చెప్పి యవ్వలఁబోయెను.

ఆయుపద్రవ మేమియో నాకుం దెలియక యందే నిలువంబడి యాప్రజలం జూచుచుంటిని. అప్పుడొక మేడలోనుండి యొక మెఱుఁగుంబోడి తలిదండ్రులతో నీవలకు వచ్చి తలిదండ్రులవెంటఁ బరుగెత్తుకొనిపోవుచుఁ గాలికి ఱాయితగిలి నేలంబడి మూర్ఛిల్లినది. ఆపాటుజూచి నేను తటాలున దాపునకుఁ బోయి ముట్టుకొనుటకుఁ