పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/370

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

361

లేదా అని చెప్పిన నేను పూర్వకర్మప్రారబ్ధమున శ్రీహరిచెప్పినమాట మఱచి తటాలున నవును. నిన్ను ఆఢకపరిమితయవలిచ్చికొంటిని. అని పలికితిని.

అంతలో నాతఁడు నాయకార మెగదిగా జూచి ఛీ ఛీ నీవెవ్వతెవు? పింగళిక యేమైనది? నీ వెక్కడినుండివచ్చితివి? పో పొమ్ము నాయెదుర నిలువవలదు. నిన్నుజూడ వాంతి వచ్చుచున్నది. అని యసహ్యించుకొని నాఆఢక ధాన్య మేమనియడిగిన యదార్థమంతయుఁ జెప్పితిని. నాకథ విని నామగఁడు నన్నుజూడ నేవగించుకొని యందు నిలువక యెందో లేచిపోయెను. తండ్రి స్వర్గస్థుఁడయ్యెను. పతిపితృ విహీననై యీపిల్లల వెంటఁ బెట్టుకొని తిరుగుచుంటిని. నాపూర్వకర్మ మిట్లున్నదని తనకథయంతయుఁ బింగళిక యెఱింగించినది.

నరవాహనదత్తుఁ డాకథవిని యక్కజమందుచు నామెను బిడ్డలను బోషించుటకుఁ దగినయుపాధు లిప్పించి యంపించెను. అని యంతదనుక నాకథజెప్పి యక్కథకుండు అబ్బా! యిప్పుడు ప్రొద్దుపోయినది. తరువాతికథ చాలయున్నది. చెప్పఁజాలను. అని పలుకుచు నందుండి లేచిపోయెను.

జగన్మోహినికథ.

నేనాకధ విని స్త్రీల సాహసచర్యల కాశ్చర్యమందుచు గోపాలుని పితృభ క్తికి సంతసించుచుఁ జిత్రసేనుని మూర్ఖత గ్రహించుచు నటఁ గదలి మిక్కిలి పెద్దగానున్న యావీధింబడి మఱికొంత దూరము పోయితిని. అందొక్కచో భూమిలోఁ గార్చిచ్చు రవులుకొని ప్రజ్వల జ్వాలాభీషణంబై మహరణ్యంబును దహించునట్టిచప్పుడు గొప్పగా వినంబడఁజొచ్చినది. ఆధ్వని విని నేనది యేమియోయని విమర్శింవు చుంటి నింతలో నావీధిగృహములందున్న వారెల్ల హల్లకల్లోలముగా