పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/368

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళికకథ.

359

చుచుఁ శిష్యులఁ గొందఱఁజూచి దాని మహారణ్యమున విడిచిరమ్మని యాజ్ఞాపించుటయు వారట్లు కావించిరి.

ఆచిన్నది చావవలయునని తలఁచి యాయరణ్యములోఁ బడి పోవుచుండ నొకచో నొకవిష్ణ్వాలయము తటాకము గనంబడినవి. అందు స్నానముచేసి దేవునిబూజించి చచ్చినచో వైకుంఠము రాఁగలదు; లేకున్న నరకమునకుఁ బోవుదుననితలంచి స్నానముజేసి యందలి పూవులచే నాదేవు నర్చించినది. నాఁడేకాక నిత్యము నెలదినములట్లు పద్మములచే నాదేవు నర్చించుచు ధ్యానించుచుండ భక్తవత్సలుండగు నాదేవుం డొకనాఁడు స్వప్నములోఁ గనంబడి పుత్రీ! నీకిష్టమైనవరము గోరికొనుమని యడిగిన నాపడఁతి మరణము దయచేయుమని కోరినది. స్వామి నవ్వుచు నీవు పతిపుత్రధనాదులఁ గోరక యాత్మహత్య గోరితి వేల? అది సమంజసముగాదు. ఆలోచించి కోరుమని పలికిన నామె స్వామీ! నేను పూర్వజన్మమునఁ బుణ్యమేమియుఁ జేసియుండలేదు. పతిపుత్ర ధనాదులు నాకెట్లు లభ్యమగుదురు? ఇట్టికురూపినిఁ బెండ్లియాడువాడెవ్వఁడు? ఇతరసుఖములతో నాకుఁ బనలేదు. మరణమే శ్రేయము. దయచేయుమని కోరిన శ్రీవిష్ణుఁ డిట్లనియె.

పుత్రీ! నీవన్నమాట వాస్తవమే. కాని జన్మాంతరమున దండ్రిగారియింటఁ గుంచెడుధాన్య మొక బ్రాహ్మణునికి దానమిచ్చితివి. ఆబ్రాహ్మణుఁ డిప్పుడు బాహ్మణునింటఁ బుట్టి నాలుగువేదములు చదివినాఁడు చతుర్వేదియని బిరుదము వడసెను. ఆబాహ్మణుఁడే నీకు భర్త కాఁగలఁడు. అతనికొక్కనికిమాత్రము నీవు మిక్కిలిచక్కని దానవుగాఁ గనంబడుదువు. నీవతనిఁ బెండ్లియాడుము చక్కనిసంతానము గలుగఁగలదు. నీవాభర్తతో యవాఢకమువలన నీవు క్రీతుఁడ వైతివని యెన్నఁడు చెప్పఁగూడదు. చెప్పితివేని ముప్పురాఁగలదు. మఱియు నీవొకప్పుడు జన్మాంతరమున నువ్వులు దినుచుండఁగా వ్రేళ్ల