పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/366

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపాలునికథ.

357

యాజ్ఞాపించి తానాస్థానమునకుఁ బోయెను. ఆవార్తవిని బ్రాహ్మణు లనేకులు వచ్చి రాజ్యము నీవే పాలింపవలయు ధర్మాత్ముండవని యెంతయో బోధించిరి కాని యతని తలకెక్కినదికాదు. తమ్ముఁడు సభకువచ్చి కృత్రిమబుద్ధితోఁ దనకు రాజ్యమక్కరలేదని కొంతసేపు ప్రతికూలము సెప్పెను. కాని బలవంతమునఁ గోపాలుండు తమ్మునికి రాజ్యమిచ్చుచుఁ దనకుమారుని వాని కప్పగించి మంత్రులకుఁ జెప్పి విరక్తుండై తపోవనంబున కరిగెను.

పాలకుండు ప్రజాపాలకుండై రాజ్యంబుసేయుచుండ నతనికొక దుస్వప్నము వచ్చినది. మంత్రులతో నాకలతెఱఁగెఱిగింప వారిట్లనిరి.

పూర్వము మీతండ్రి కిట్లె దుస్వప్నము వచ్చినంత బ్రాహ్మణుల కెఱింగింపగా వారు హోమములు సేయింపుఁడని చెప్పిరఁట. దానఁ గోపించి వారిఁ బట్టికొని కొట్టించెను. వారుచెప్పిన మితి కే కోటమీఁద పిడుగుపడి కోట నాశనమైనది. కావున బ్రాహ్మణులచే జపములుచేయించవలెను. లేక కొన్నిదినములు దేశాంతర మరుగవలయును. సింహాసనముమీఁద మృగముచెక్కించి పాలింపవలయునని యుపాయము చెప్పిరి.

అట్లు వారు మాట్లాడికొనుచుండఁగా నన్నకుమారుఁడు నరవాహనదత్తుఁడనువాఁడు బంతియాడుచుండ నాబంతి దొర్లి సింహాసనముదరికి వచ్చినది. దానిఁ దెచ్చుకొనుటకై యబాలుం డట కరిగెను. వాని యాకారగౌరవము జూచి సంతసించుచుఁ బాలకుండు వానికి రాజ్యమిచ్చి తాను తపోవనంబునకుఁ బోయెను.

తరువాత నరవాహదత్తుడు భూపాలుండైప్రజలం బాలించు చుండెను. ఒక నాఁడతనికడ కొకయాఁడుది వికృతాంగి చూడ నసహ్యము జనించినది రత్నములవంటిబిడ్డలఁ నాఱ్వుర వెంటబెట్టుకొని వచ్చి ఆశీర్వదించినది. ఆవికృతాంగిం జూచి యారాజకుమారుఁడు అస