పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/363

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నఱుకుము. తరువాతి బొంకులు నేను బొంకఁగలను. అనిపలుకుచు నాకులట విటునితోఁ గలిసికొనినది.

ఆమాటలన్నియుఁబ్రచ్ఛన్నముగానుండిగోపాలుఁడాకర్ణించెను. అయ్యో! కాముకురాలుగూడ నన్నాక్షేపించినది. నే నేకర్మము నెఱుంగను. లోకాపవాద మిట్లు వ్యాపించుటకుఁ గారణమేమియో యని యాలోచించుచు నతం డటకదలి మరియొక వీధికింబోయియొక గృహముకడఁ బొంచి యాలించెను.

ఒక బాహ్మణుఁడు భార్యతో నోసీ! పిల్లవాఁడు లేచి ఏడ్చుచున్నాఁడు. లేచి పాలిమ్ము నిద్ర యేమిటికిఁ బోయెదవని లేసిన నా యిల్లాలు కోపముతోఁ బిల్లవానిం గొట్టుచు పితృఘాతకుఁడా! ఏల ఏడ్చెదవు. నే నీకుఁ బాలీయఁజూలను. నిద్రవచ్చుచున్నది. పండుకొనుమని మందలించినది. ఆమాటలు విని యా బ్రాహ్మణుండు మూర్ఖురాలా! పిల్లవానిని బితృఘాతకుఁడా ! యని పిలిచెద వేమిటికి? వాఁ డింకను బాలు వదలలేదు. పితృఘాతకుఁ డెట్టులయ్యెను. ఈలాటి తుచ్ఛపు పలుకలు నీనోటనుండి రావచ్చునా? అని యడిగిన నామె లేచి మీకు దెలియలేదా ? కొడుకు లెప్పుడు పెద్దవారైనతోడనే తండ్రిచావును కోరుచుందురు. మన గోపాలుఁ డేమిచేసెనో చూచితిరా? ఆత్మసుఖమునకై తండ్రిఁజంపించి యారాజ్యము తానేలుచుండెను. వీఁడుమాత్ర మెదిగిన తరువాఁత మనల నెక్కువ నిర్వాహకముచేయునా? అని యుత్తరము చెప్పినది.

ఆమాట లాగోపాలుని చెవింబడినవి. అయ్యయ్యో! ఎక్కడికిఁ బోయినను నాకీమాటలే వినంబడు చున్నవి. నాతండ్రిని నేనెట్లు చంపితినో యెఱుంగను. గ్రామమంతయు నాయపయశము వ్యాపించినది. అని దుఃఖించుచు మఱియొక వీథికిఁ బోయి యాలింప నొకచోఁ దండ్రియుఁ గొడుకును గ్రుద్దులాడుచుఁ గొడుకు తండ్రితో నీవు బ్రతికి