పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపబర్హణుని వివాహము

23

మీ సేవకురాలు మాలావతి నతని యర్ధాంగింజేసి యాశీర్వదింపుమని జనాంతికముగాఁ బ్రార్ధించిన మహేశ్వరుఁడు నవ్వుచు మాలావతికే కాదు. నీకూతుండ్రందరకు నతండే భర్తకాఁదగినవాఁడని యుత్తర మిచ్చెను.

అట్లైన మఱియుం బ్రమోదమేకదా. అని చిత్రరథుడు పలికెను. అందుఁ గల సంగీత విద్వాంసుల కందఱకు నువబర్హణునే కానుకలిచ్చునధికారిగా నియమించుటచే నతండందున్న గాయకుల పేరులు చదువుచుఁ బరీక్షించి వారివారికిం దగిన పారితోషికము లిప్పించుచుండెను.

మాలావతి మొదలుగాఁ గల చిత్రరధపుత్రిక లేబదుగురు తమ పేరులు వ్రాసియిచ్చియుండిరి. ఉపబర్హణుఁ డాపట్టికం జూచి మాలావతి యెవ్వతె? యని యడిగిన నమ్మగున నగజప్రక్కం గూర్చుండి యట్టెలేచి నేను నే నని యుత్తరమిచ్చినది. ఆతం డత్తలోదరి గానకళాప్రసక్తిం గొన్నిప్రశ్నము లడిగి సదుత్తరంబు వడసి మెచ్చుకొనుచు నా మచ్చెకంటి కీయఁదగిన కానుక యేవియని యాలోచించు చుండ జగదంబ గ్రహించి యిట్లనియె.

కుమారా! ఈ బాలిక చక్కఁగాఁ బాడినది. దీనికిం దగిన పారితోషిక మేమియిత్తువు? యీసతి మితముగా నిచ్చిన నొప్పుకొనదు. అమితప్రదుండవు కావలయునని మా యభిప్రాయము. ఏమందువని యడిగిన నామాట కర్ధము గ్రహించి యుపబర్హణుఁడు అంబా! నేను మీయాజ్ఞాకరుండ. నాకొక స్వతంత్రముగలదా. మీ రెట్లు చెప్పిన నట్లు చేయుటకు సంసిద్ధుఁడనని యుత్తరము జెప్పెను. అప్పుడు పార్వతి యాయువతి నొడిలో నిడుకొని,

ఉ. ఈమె మహాపతివ్రతల కెల్ల శిరోమణియై జగన్ను తో
    ద్దామయశఃప్రకాశముల ధర్మరతిం బతితోడఁగూడి నా