పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/357

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కము. బాబూ! నేననవలసినమాట కాదుకాని మాకుందమాలను బోలిన యెలనాగ యీభూమండలమందేకాదు స్వర్గమందుఁగూడ లేదని చెప్పఁగలను.

నేను — అట్లై న నేను ధన్యుఁడనే కదా.

వ్యా – చక్రవర్తులు వచ్చి యూళ్లిత్తుమనియు దేశములిత్తు మనియుఁ గన్నెఱికము సేయుటకుఁ గోరిరి. నేనును నాకూఁతురుగూడ నంగీకరించితిమికాము. తగినవాఁడు దొరకవలయు నభిలాష తీరవలయు. ఊళ్ళును దేశములు నేమిచేసికొనఁగలము.

నేను -- నీవుమంచిగట్టిదానవఁట. నీమాట వీథిలోఁ జెప్పికొనిరి.

వ్యా - ఇప్పటివాండ్రకు మాపాటి సామర్థ్యములేదు. ఇంతకు దాని కళ్లముందర దాటవలయుఁ గదా.

నేను - నే దాటించెద వెరవకుము. ప్రొద్దుపోయినది. కుందమాలను రప్పింపుము.

వ్యా - అమ్మాయికిఁ గల నగలన్నియు రత్నములు చెక్కినవియే. యలంకరించుకొని యిప్పుడే రాఁగలదు. అంత దనుక మీరాహంసతూలికాతల్పంబునఁ బండుకొనియుండుఁడు. నేను బోయి వేగ ననిపెదనని చెప్పి యది యవ్వలకుఁ బోయినది. అప్పుడు నేను మెల్లగ లేచి యామంచము దాపునకుఁ బోయి సంశయముతో

“శ్లో|| శయనేహస్త తాడనం” పండుకొనునప్పుడు చేతితో శయ్యంగొట్టి దులిపి పిమ్మట శయనింపవలయునని చిన్నప్పుడు చదివికొన్నమాట జ్ఞప్తికివచ్చుటచేఁ గుడిచేఁతితో నట్లు కొట్టితిని. అది యమరించిన యంత్రము గడియసడలి తటాలున నాశయ్య యగాధముగానున్న నూఁతిలోఁ బడినది.

నే నాయుపద్రవముఁ జూచి ఔరా! యీరండ యెంతమోసము చేయుచున్నది? ఈకపట మెవ్వరును దెలిసికొనలేకపోయిరే. ఎంత