పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/356

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుందమాలకథ.

345

దానిమేడ యాప్రాంతమందే యుండుటచేఁ దెలిసికొని పోయి యా యింటి వీధియరగుపైఁ గూర్చుంటిని. అంతలో సాయంకాలమైనది. వాడుకప్రకారము దాదియొకతె తలుపులు తెరచికొనివచ్చి దీపము వెలిగించి నన్నుఁజూచి అయ్యా! తమరెవ్వరు? ఏమిటికై యిందుఁ గూరుచుంటిరని యడిగినది.

కుందమాలవాడుక విని యాచేడియం జూడవచ్చితిని. మాది విదేశము నాయాశయ మా కుశేశయవదన కెఱింగింతువేయని కోరితిని. అది నామాటలువిని కన్నులు చిట్లించుచుఁ గుందమాలకు గాదు. ఆమెతల్లికిం జెప్పి తీసికొనిపోయెద నిందు నిలుండని పలికి యాదాది లోపలికిఁ బోయి గడియలోవచ్చి ముచ్చటమాటలాడుచు నన్నాసదనాంతరమునకుఁ దీసికొనిపోయి యొకపీఠంబునంగూర్చుండఁ బెట్టినది. నేనందలి వింతలు చూచుచుండ నింతలోఁ గుందమాల తల్లి వ్యాఘ్రముఖి వచ్చి నాకు సమస్కరించుచు,

వాఘ్రముఖి — ఓహో! మీరు మహారాజుబిడ్డలువలె నుంటిరి. మేమెంతధన్యులము. మాకుందమాల నోము లిప్పటికి ఫలించినవి. మీనివాసదేశమేదియో చెప్పెదరా?

నేను — అబ్బో! మాది చాలదూరదేశము. నేనొక రాజకుమారుఁడనే.

వ్యా — ఆమాట మీరుచెప్పకయే మీ మొగమే చెప్పుచున్నది. సామాన్యుల కీసౌందర్యాతిశయముండు నా. బాబూ మీపేరేమి?

నేను - సౌమ్యుఁడందురు.

వ్యా — ఇఁక నేమి! మీ సౌశీల్యము నామమే చెప్పుచున్నది.

నేను - ఏదీ, మీకుందమాల యిటురమ్మను, మిక్కిలి చక్కనిదని వింటిని?

వ్యా — అలంకరించుకొని రాఁగలదు. ఇదిగో దాని చిత్ర ఫల