పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/354

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుందమాలకథ.

343

వానింజూచి అదిగో మనసౌమ్యుఁడని పింగళుడు కేక పెట్టెను. ఆ కేకవినిసౌమ్యుఁడు వారి నికటమున కరుదెంచి యోహో! మాసోదరులందఱు నిచ్చటనే యున్నా రే నారాక శుభోదర్కమైనదే యని పలుకుచుండఁ బుష్ప కేతుఁడు సౌమ్యా! నీవీగుఱ్ఱపురౌతులఁ దఱుముకొని వచ్చితివేల? వాండ్రు నిన్నేమిగావించిరి? అని యడిగిన నతం డిట్లనియె.

అన్నా ! మన మిన్నగ రాధిపతి నాఁడుది యనుకొనలేదా మగవాఁడఁట. నే నేదియో యపరాధము చేసితినని నన్నుఁ గట్టి తీసికొనిరమ్మని యీయోధుల నంపెను. అందులకై వారిం దఱిమితినని చెప్పగా నవ్వుచుఁ బింగళునితో నేననినట్లేయైనది చూచితివా కానిచో నొరులకు రాజుపైఁ దిరగఁబడు సామర్థ్యముండునా ! సౌమ్యా ! నేనే నీకావార్త నంపితిని. నేనే యీనగరమునకు రాజైతిని. అంతయుఁ నానకజెప్పెదంగాక యిప్పుడు కోటలోనికిఁ బోవుదము రండు అని పలుకుచు మణిమంతుని రప్పించి వర్తకుఁడా! నీయదృష్టము మంచిది. యదృచ్ఛగా నీబిడ్డకుఁ జక్రవర్తి కొడుకు మగఁడయ్యెను నీయల్లుఁడు మాతమ్ముఁడే యని యాకథయంతయుం జెప్పి వారి నందఱ వెంటఁబెట్టికొని దివాణములోనికిం బోయెను.

పుష్ప కేతుం డంతఃపురమున నొకసభజేసి తనభార్య రత్నమకుటను రప్పించి తమ్ములంజూపుచు జరగిన వృత్తాంతమంతయు నెఱింగించెను. లోకాతీత ప్రతాపసంధుక్షులగు మీకుఁగాక యొరుల కిట్టిపౌరుషము గలిగియుండునా అని పరిహాసమాడినది. తరువాత నొండొరుల చరిత్రము లిట్లు చెప్పుకొనిరి.

కుందమాల కథ.

అందు సౌమ్యుఁ డిట్లనియె. సోదరులారా ! నాఁడు నేనును బింగళుండును నీవీఁటి వేశవాటికంగల విశేషములఁ దెలిసికొనఁదలంచి