పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/350

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

339

వురు వోయివచ్చిరి. మణిమంతుఁడు:- మహారాజా పిల్లవాండ్రమాటలు మీరు పాటింపఁగూడదు. రేపు బతిమాలి తీసికొనివచ్చెద. నేఁటి కూరకుండుఁడని ప్రార్థించెను. నాయాజ్ఞనిని యతం డేమనియెనో చెప్పుమని భటునడిగిన వాఁడిట్లనియె.

దేవా ! మేముపోయి దేవరసందేశ మెఱిఁగించితిమి. నే నపరాధివలె నరపతికడకు వచ్చువాఁడను గాను. అతనియాజ్ఞ మన్నింప నాకవసరములేదు. నాబలము దెలిసికొన నభిలాషగలదేని కయ్యమున కాయత్తపడియున్న వాఁడ. పొండు పొండు. నన్ను రప్పించుటకువాని కేమిసామర్థ్యమున్నదని యతఁడు నిర్లక్ష్యముగా నుత్తరముచెప్పెను. దేవా ! వాఁడు మీయానతి తృణముకన్నఁ దేలికగాఁ జూచెను. పాప మీవర్తకుఁడు రమ్మని బతిమాలికొనినను వినిపించుకొనలేదని భటుం డెఱింగించిన విని పుష్పకేతుఁడు ధూమకేతుండువలె మండుచు నిట్లనియె.

ఓహో ! ఇందలిప్రజలకు నాసామర్థ్యము దెలియలేదు. ఇంకను నాఁడుదియే పాలించుచున్నదని తలంచుచున్నవారు కాఁబోలు. మణిమంతా ! నీవింటికిం బోయి నీయల్లునితో నిప్పటిరాజు రత్న పాదుఁడు కాడని చెప్పుము. మేకలవంటి యతనిమూకల నేమో చేసితినని గరువముఁజెందియున్న వాఁడు కాఁబోలు కాచికొనుమని చెప్పుము వాని పరాక్రమముఁజూడ నాకును వేడుకగానేయున్నది. రేఁపు ప్రాతఃకాలమే బద్ధసమయమని తెలియఁజేయుము పొమ్ము. అని వానినంపి పీఠమునుండి లేవఁబోవుసమయమున వ్యాఘ్రముఖి తమ్మునివెంట నరిగిన భటు లరుదెంచి యిట్లనిరి.

దేవా ! మేమా హంతకునికడ కరిగి దేవరయాజ్ఞ యెఱింగించిన నవ్వుచు నతఁ డిట్లాక్షేపించెను.