పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నవాఁడు లేడు. నీ నిమిత్తమే సర్వమంగళ యీవిపంచి నిర్మించి తెచ్చినది. దీనిపై సంతతము శ్రీహరిం గీర్తింతువుగాక. అని పలుకుచూ నాశర్వాణి పాదపీఠముదావునకుఁ దీసికొనిపోయి నిలువఁబెట్టెను.

ఆమె యతనిమ్రొక్కు లందుకొని పెండ్లికొడుకవుకమ్మని దీవించుచు నా విపంచి యతనిచేతం బెట్టినది.

అప్పుడు సభ్యు లతనిపైఁ బుష్పవర్షము గురిపించిరి. పిమ్మట నతం డగ్రపీఠ మలంకరించి యామహతి మేలగించి యనంతరాగము లుప్పతిల్ల సర్వజనమోహజనకంబుగా గీతంబులం బాడి వేద వేదాంగముల వినిపించి శాస్త్రప్రపత్తులం దెలిపి శ్రోతలరాగవివశులం గావించె నప్పుడు,

సీ. తుంబురుఁడు రులజ్జతో నెక్కడో డాగి
             కొనియె నింద్రుఁడు మెచ్చికొని నుతించె
    బాపురే యనుచు దిక్పతులు సన్నుతిఁజేసి
             రురగులు పొగడిరో హో యటంచు
    విద్యాధరులు మోహవివశులై కొనియాడి
             రౌరాయటంచు గుహ్యకులు మెచ్చి,
    రాదిత్యులెల్ల మేలౌనౌనటంచుఁ గై
            వారముల్ సేసి ర ప్సరసలెల్ల

గీ. ఫాలమునఁ గేలుగీలించి ప్రణుతిఁజేసి
    రోలగములోని వారెల్ల నొక్క. పెట్టు
    భళిర ! యువబర్హణా ! బలే ! బాగు బాగు
    లెస్సపాడితివని నుతుల్ సేసి రపుడు.

అప్పుడు చిత్రరథుఁడు పరమేశ్వరుఁడు వినఁ బార్వతీమహాదేవితో అంబా! నీ వాగంధర్వకుమారునికి వల్లకి నిచ్చుచుఁ బెండ్లికొడుకవు గమ్మని దీవించితివి. ఆదీవెన వరముగా దయచేయుము.