పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/349

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గా జంపి నూఁతిలో బారవేసెను. అడ్డమువచ్చిన మఱికొందఱ దాదులఁగూడ నాక్రోశింపుచుండ నానూతిలోనే పడవేసెను. మామేనకోడలు కుందమాల వానికిఁ జడిసియో వరించియో యహత్య యెవ్వరికిం దెలియఁజేయక యాశవములఁజాటుగాఁ దహింపజేసి వానింబెట్టుకొని కులుకుచున్నది. తల్లిచావున కించుకయు విచారములేదు. స్త్రీల చరిత్రలు దేవర యెఱుంగునివికావు. ఆవిటుఁడు సంతతము దానితోఁ గలసిమెలసి వర్తించుచున్నాడు. వాఁడు చాల పొగరుఁబోతు. నేను మాయక్క చావునకు దుఃఖించుచుఁ గుందమాలతో నీహత్యాప్రకారము చదురునఁ జెప్పికొనుమని యెంత బోధించినను వినక చచ్చిన తల్లి తిరుగారాదు. ఈవిటుఁడు మంచివాఁడు వీని జంపించిన లాభ మేమని యుపేక్ష జేసినది. దానంజేసి నేనే యీయభియోగము దెచ్చితిని. ప్రతివాది మీయాజ్ఞపత్రిక జూచియుఁ బుచ్చికొనియుఁ దిరస్కారముతో నిందురాలేదు. దేవర వాని రప్పించి యీయభియోగము విచారింపుఁడని కోరికొనుచున్నాను.

అని యెఱింగించిన వానిమాటలు విని పుష్ప కేతుఁడు మంత్రిం జూచి ఇక్కడిప్రజలు మీయాజ్ఞల మన్నింపరు కాఁబోలు. ప్రతివాది రాకున్న నెట్లు విచారింతుము. తగిన భటులంబంపి వానింబట్టి తెప్పింపుమని యాజ్ఞాపించుటయు నతండప్పుడే యతనిం దీసికొనిరాఁ బదుగుర రాజభటులం బంపించెను.

ఈలోపల మణిమంతుఁ డరుదెంచి మహారాజా ! నాయల్లుఁడు చాల యలసియున్నాడు. రాలేనని తమతో మనవిచేయుమన్నాఁడని యేదియో చెప్పఁబోయిన నలుగుచు ఔను. నేనప్పుడే యనుకొన్నాను. ఇది స్త్రీ రాజ్యమనుకొనుచున్నాడు కాఁబోలు పురుష రాజ్యమని చెప్పుము. గడియలో రాకున్న వానిం గట్టి తెప్పింతు. క్రమ్మఱఁబోయి చెప్పుమని యతనివెనుక నొక రాజభటునిగూడ నంపించెను. వారిరు