పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/347

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యుఁ బొడిచియు మొఱ్ఱోయని యఱచుచు నాతురతంబాఱుచుండ వెన్నంటి లేళ్ళగమిం దఱుము బెబ్బులియుం బోలె పఱచుచు నాభీల కరవాల ప్రహారముల నాబలమునెల్ల గడియలోఁ బీనుఁగు పెంటలు గావించెను. మహారాజా? మీకడ ససత్యమాడనేల? చేతులు తెగి యఱచువారును బాదంబుల నరకఁబడి యేడ్చువారును ఖండితంబులగు శిరంబులతోఁ బాఱువారునై యతని జనులు పరితపింప నాప్రదేశము జూడ భయంకరముగాఁ దోచినది. హత శేషులుగోడగోడల సందుసందుల దాగికొని ప్రాణములు దక్కించుకొనిరి. అతని పరాక్రమముజూడరుద్రుడోయని మాకేభయమైనది. దేవా ! ఇదియే జరిగిన కథ. ఇందు మాతప్పేమి యున్నదియో దేవర విచారింపవలయును. మాయల్లుఁ డడ్డపడనిచో నీతఁడు మాయిల్లు కొల్లగొట్టువాఁడే. అప్పుడు మే మే మగుదుము అని యావృత్తాంత మంతయు మణిమంతుఁ డెఱిఁగించుటయు విని పుష్ప కేతుఁ డవ్వీరుని శౌర్యమునకు విస్మయము జెందుచు రత్న పాదునితో నిట్లనియె.

సెట్టీ ! నీవియ్యంకుఁడు సెప్పిన కథయంతయు వింటివా ? ఇందేమైన ససత్యముండిన నడుగుము. విమర్శించెదనని పలికిన నతండు ఇందేమియు నసత్యము లేదు. చెప్పినదంతయు సత్యమే. నిరాయుధులైన మాభటులం బీనుఁగు పెంటలు గావించెనని యతం డొప్పుకొనుచు నప్పని తప్పుగాదని పలుకునేమి ? అంతకన్న నపరాధ మేమి యున్నది? మేముబలవంతమున నతని యింటిపైఁబడి కొల్లగొట్ట దలంచిన దేవరకుఁ జెప్పికొనవలయుంగాని యల్లునిచే హత్యలుగావింప వచ్చునా? ఇంతకన్న నపరాథ మేమున్నది? అని పలికిన విని పుష్ప కేతుఁడు నవ్వుచు నిట్లనియె.

సెట్టీ! నీకీమాత్రము బుద్ధియుండిన నీముప్పే రాకుండెడిదికదా. ఆతగవుమాయొద్దఁబెట్టక బలము గలదుగదా యని వాని యింటిమీఁద