పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/346

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

335

తరమునుండివచ్చిన కోమటిశెట్టి పొరుగూరిలో నిట్లు బీరములుగొట్టునా. కానిండు మీరు వెరవఁబనిలేదు. రాజ్ఞినొద్దకు బోయి చెప్పుకొననవసరము లేదు. అతనికడ నాలుగువేల వీరులున్నారా.

ఉ. నాలుగువేలుగాదు భువనంబులు మూడునుగూడి వచ్చినన్
    లీల జయించువాఁడను చెలింపక సంగరసీమ నిల్చి మ
    త్కాలకరాళహేతితత ఖడ్గనిశాతవిఘాత పాతన
    జ్వాలల పాలుగాఁగ రిపుజూలముల న్మడియింతుఁ జూడుఁడీ.

మామా! మీరందఱు జింతమాని సుఖంబుండుఁడు. రత్నపాదుని భటుల మన పందిరిలోనికి రాకుండ నేను గాపాడెద నని పలికిన నందరము విస్మయముజెందితిమి.

మఱునాఁడు సూర్యోదయము కాకమున్న రత్న పాదునిబలము దుడ్డుకఱ్ఱలుబూని వచ్చుచున్నట్లు వాతన్‌లు వచ్చినవి. అప్పుడు మా యల్లుఁడు చేఁతఁ గరవాలంబు మెఱయ రయస్తుతంబగు నొక హాయ మెక్కి ప్రచండ హేతిభీకరుం డగు చిత్రభానుండో యన నొప్పుచు మాయింటి మొగసాలం గాచికొని యుండెను.

క. మణిమంతుని పని తీరఁగ
   నణువైన న్మిగులకుండ నతిశయసంప
   న్మణి కనక వస్తు వాహన
   గణముల వెసఁ గొల్లకొట్టి కైకొందుమిఁకన్ .

అనికేకలు వేయుచు దండములు ద్రిప్పుచు మూకమూకలుగా మాయింటికడకు వచ్చుచుఁ బెండ్లి పందిళ్ళన్నియుఁ బాడుపడెడుగా దండములతో బాదుచుండిరి. అప్పుడు మాయల్లుఁడు వాండ్రయల్లరి దిలకించి తనగుఱ్ఱమును మడమలతోఁ గొట్టినంత నది రివ్వుర నెగసి శత్రువీరుల కడ కొక్కయడుగులోఁ బోయినది. అతండు గుఱ్ఱపుడెక్కలచే వారిం ద్రొక్కించియుఁగరవాలంబున నేసియుఁద్రోసియుఁ గ్రుచ్చి