పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/341

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఇప్పటికిఁ బెండ్లివారే రాలేదే! ఏమిచేయుదము? అని యడిగిన నే నేమియు సమాధానముచెప్పక యూరక యాదెస జూచుచుంటిని.

ఇంతలో నిరువురు గుఱ్ఱపురౌతులు వడిగా వచ్చుచు నొకచో గుఱ్ఱములనాపి పెండ్లివారిల్లెక్కడనని యడుగుచున్న మాటలు వినంబడినవి. ఇటురండు. ఇటురండు. అని వారిని కేకలు వేయించితిని. వారు నేనున్న కడకు వచ్చి యాతఁడే కన్యాదాతయని యెవ్వరో చెప్పఁగా గుఱ్ఱములు దిగి వాండ్రు నాకు నమస్కరించిరి.

అప్పుడు నేను కోపముతో నోహో! మీయజమానుఁ డెంత మోసకాఁడు ! సుముహూర్తమున కొకదివస మెడముండగా రమ్మని చెప్పితినే. ఇప్పటికి రాలేదు ఏమి చేయవలయును ? ఎంత దూరములో నున్నారు అని యడిగిన వాండ్రు మోమున విన్నఁ దనముదోపనేదియో యుత్తరము తత్తరముతో నాకిచ్చిరి. దాని విప్పి చదువ నిట్లున్నది.

రత్నపాదుఁడు నియమితదివసమునాఁడే పదివేలజనముతో నిల్లు బయలుదేరి యోడలెక్కి సముద్రము దాటుచుండ గాలిత్రోపున నౌక లొకకొండకుఁ దగిలికొని వికలములై సముద్రములో మునిఁగినట్లు మాకు వార్తలు వచ్చినవి. వారిరక్షణకొఱకు కొన్ని యోడల మేమందుఁ బంపితిమి. వారిక్షేమసమాచారము మాకిప్పటి కేమియుం దెలియలేదు. కావున వారివృత్తాంతము తెలియువఱకు ప్రస్తుత మీసుముహూర్త మాపవలెనని కోరుచున్నాము. మేము రత్నపాదున కత్యంతబంధువుల మగుట విూరు దొట్రుపడుచుందురని యీవార్త మీకుఁ దెలియఁజేసితిమి.

ఆపత్రికం జదివితిని. నా నాడులన్నియుం గ్రుంకినవి. నేలం జదికిలఁబడితిని. అప్పుడు నా చిత్త మెట్లుండునో విచారింపుఁడు. అర నిమిషము నాకు మేను దెలిసినదికాదు. ఏమిచేయుటకుం దోచక