పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపబర్హణుని వివాహము

21

చ. అడుగుఁడు నన్ను గానకళ లం దెటనైన సదుత్తరంబుగా
    నుడివెద శాస్త్రపద్ధతి మనోజ్ఞముగాఁ దగఁబాడువాఁడ నె
    వ్వఁడు గలఁడిందు నాకుఁ బ్రతి వాది వచింపుఁడు వానిపేరు న
    న్గడచినవాని కిందు మణి కంకణమిచ్చెద మెచ్చి చెచ్చెరన్ .

క. గానం బొకఁడే కా దె
   వ్వానికి నేవిద్యయందుఁ బరిచితిగలదో
   దాని నడుగంగవచ్చుం
   బో నిపుణతదెలియ మెప్పు బొందఁగ నిందున్.

అని పలికి కూర్చుండెను. అప్పుడు

సీ. మోమెత్తకట మౌనముద్రఁబూనుచుఁ దుంబు
            రుఁడు కాలి పెనువ్రేలఁ బుడమివ్రాయు
    ఘనులు హాహా హూహు గంధర్వులురు లజ్జఁ
            దలవాల్చికొని యేమి పలుకరైరి
    వినుపించుకొననిచాడ్పునఁ బరాకుగ మాట
            లాడుదు రితరులతోడ సురలు
    వగచి డెందములఁ బన్నగులు విన్నదనంబుఁ
            దొడరంగఁ బడగలుముడిచికొనిరి

గీ. యూర్వశియు రంభ మేనకయును ఘృతాచి
   మారుపలుకక యొకమూల మసలుచుండి
   రెఱిఁగి యాసభ్యులందు నొక్కరుఁడు గాని
   నిలిచి యేనని పలుకంగ నేరఁడయ్యె.

అప్పుడు బృహస్పతియే వానికిఁ బ్రతివాదియై సంగీత శాస్త్రములో విపులముగాఁ బ్రసంగించి తత్సమాధానములకు మెప్పువడసి యతని నాలింగనముజేసి గంధర్వపుత్రా! నీవు కారణజన్ముండవు. హరిభ క్తాగ్రేసరుఁడవు. సంగీతమందే కాదు. ఏవిద్యలో నిన్ను మించి