పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/337

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బడి నమస్కరించిరి. వారిరువుర పేరులు తెలిసికొని

పుష్ప కేతుఁడు — మణిమంతా! నీదీయూ రేనా?

మణి - చిత్తముమహాప్రభూ మా తాత తండ్రులనాఁటి నుండియు మా దీనగరమే కాపురము.

పుష్ప - నీవు కోటీశ్వరుఁడవఁట నిజమేనా?

మణి - ప్రభువువారికిఁ బదికోట్లమీఁదఁ బన్ను గట్టుచున్నాను మహాప్రభో!

పుష్ప - ఈరత్న పాదు నెఱుగుదువా?

మణి — ఎఱుఁగుదును మహాప్రభో. యెఱుఁగుదును.

రత్న పాదుఁడు - ఎఱుఁగబట్టియే నాకొంప నిట్లు ముంచినాఁడు.

మంత్రి — ఉస్స్ నీవు నడుమ మాటాడరాదు.

పుష్ప - గొప్ప స్థితిగల వర్తకుని కుమారునకుఁ బిల్లనిత్తునని యొప్పుకొని వారు తరలివచ్చులోపల నీకూఁతును మఱియొకని కిచ్చి వివాహము చేయుటయేకాక నీయల్లునిచే వారి బలగమునంతయుఁ జావమోదించితివఁట. కొందరు చచ్చిరఁట. కొందఱు కాలుసేతులు విరిగి బాధపడుచున్నారఁట. నిజమేనా? ఈదేశమునం దిట్టి యాచారము లున్నవియా యేమి? హత్యలనిన సామాన్యదోషము లనుకొంటివా?

మణి – మహాప్రభూ! మాకథ యంతయు మీరు సాంతముగా వినినగాని నిజము బయలు పడదు. చెప్పుటకు సెలవైనచోఁ దెలిపెద.

పుష్ప — ఊ. చెప్పుమనియేకదా నేనడుగుచుంటిని?

మణీమంతుఁడు చేతులు జోడించి మహారాజా! నేను మిక్కిలి భాగ్యవంతుఁడ నయ్యు సంతానము బొడమక కొంతకాలము పరితపిం