పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/335

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

కాశీమజిలీకథలు - పదియవభాగము.

హింతు. లేకున్న నొడంబడనని పలికిన విని యక్కలికి నవ్వుచు నెందైనను మగవారు మీదువారు. వారిమాటయే పైగానుండును. అందుల కాటంకమేమి? మీయిష్టమువచ్చినట్లు శిక్షించుకొనుఁడని యప్పుడే యతనిమెడలో ముక్తాదామము వైచినది. అతండు మఱి యొకదామం బాపడఁతిమెడలో వైచెను. అదియే వారికి వివాహము. వేశ్యారత్నముతోఁగూడఁ బింగళు నక్కడకుఁ దీసికొనిరమ్మని వారొక విచిత్రభవనాంతరమున కరిగిరి.

శ్లో. విలసదమలదీపె పుష్పదామావకీర్ణె
    ప్రసృతసురభి ధూపెధామ్ని కామీ‌ సువేషః
    సహసహచరవగైన్ ర్వామపాశెన్వ్ నివేశ్య
    స్త్రియముపహితవేషాం భావయేన్నర్మగోష్ఠీం.

శ్లో. కలాకలాపైశ్చయుతం సమస్తైః
    గుణైరసం కేతవిదం హికాంతం
    ప్రమ్లాన నిర్మాల్యమివోత్సృజంతి
    గుణాధికానాగరికాస్తరుణ్యః

శ్లో. తతోన్యచింతాంపరిహృాత్య కామీ
    యతేత సాంకేతిక శాస్త్ర కేషు
    సతాంహి సమ్మానసహస్రభాజాం
    యూనాం వధూధిక్కృతి రేవ మృత్యుః

సకలకలాపాండిత్యము గలిగియున్నను నారీసాంకేతిక మెఱుంగని పురుషుని గుణాధికలగు నాగరిక స్త్రీలు వాడిన నిర్యాల్యమాలికలవోలె గౌరవింపక విడిచివేయుదురు. కావున నితరచింతవిడిచి పురుషుఁడు నారీసాంకేతికవిథానము దెలిసికొనవలయును. అనేక సన్మానములు బొందుచున్నను యౌవనవంతులకు స్త్రీధిక్కారముకన్న నవమానము వేరొకటిలేదుగదా.