పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/334

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

323

అందులకై యిట్టివ్రతము బూనికొంటిని. మహారాజరత్నము నాకు స్నేహితురాలు. మంచియందకత్తెయ. విద్వాంసురాలు. నా పేరున నిట్టిప్రశ్నములిచ్చుట కిష్టపడక దానిపేరునం బ్రకటించితిని. వేశ్యల గేహములకు పురుషశ్రేష్ఠులు వచ్చుచుందురని యట్లు నియమించితిని ఆమేడ నిజముగా దానిదే. అదియు సామాన్యుల నొల్లక కన్యకగానే యున్నది. మొన్న మీతమ్ముని వరించి మెడలో బూవుదండ వైచి తనమేడకుఁ దీసికొనిపోయినది. ఆయనతో మీవృత్తాంత మింకను జెప్పలేదు. మఱియు నాప్రశ్నముల కుత్తరమీయలేనివారిం బరిచరులఁగాఁ జేసికొననేల యందు రేమో వినుండు. మొదటగొన్ని దినము లట్లే ప్రకటించితిని. విద్యావిహీనులుగూడ నిత్యము నాప్రశ్నముల కుత్తరమిత్తుమని లోపలిగృహవిశేషములు చూడ ననేకులు వచ్చుచుండిరి. దానంజేసి విసిగి యిట్టినియమము గావించితిని కాని లోకుల వంచించుటకు గాదు. మాతప్పులన్ని యు మన్నించి యీరాజ్యముతోఁగూడ నన్ను బరిగ్రహించి స్త్రీరాజ్యమన్మధసామ్రాజ్యములకుఁ బట్టభద్రులు కండు. నేను మీచే వాదంబున గెలువబడితిని గదా? అని ప్రార్థించిన నతండించుక యాలోచించి యిట్లనియె,

దేవీ! నాచే నోడింపఁబడినది మహారాజరత్నముకాదా నీవెట్ల గుదువు ? అనుటయు నాచతుర, మీరు విద్వాంసులు. ఆ పేరు మాయిద్దరియందు వర్తించుచున్నది. నేను మహారాజరత్నము ననుకొన దగనా? కావున మీచే నోడిపోయినదానను నేనేకాని యదికాదని యుత్తరము చెప్పినది.

ఓహో ! మహారాజులలో రత్నమువంటిదాననని నీవు శబ్దార్థమును దిరపచుచుంటివా. ఈమాటు మెచ్చుకొంటి. సరిపోయినది. కానిమ్ము. సిరిరా మోకాలొడ్డువాఁ డుండునా? నీవు రాజ్ఞివని గరువమునొందక నాయిచ్చవడువున మెలంగెదనంటివేని నిన్నుఁ బరిగ్ర