పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/329

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గూర్చుండఁబెట్టిరి. ఆభవనాలంకారములం దిలకించి యారాజపుత్రుఁ డది స్వగర్వమేమో యని భ్రాంతిపడఁజొచ్చెను. అందు నానావిధఫలములు పుష్పములు దళములు జిగుళ్ళు మొదలగు వింతవస్తువులు పేరులువ్రాసి యద్దపు మందసములలో నునుపఁబడి యున్నవి. పెక్కేల? అది యొక చిత్రశాలవలె నొప్పుచున్నది.

అతం డా శయ్యదిగి యొకపీఠముపైఁ గూరుచుండి యది యెట్టి ప్రశ్నములిచ్చునో యనియాలోచించు చుండెను. అంతలో వాడుక ప్రకారము పరిచారికచే బంగారు తళియలోఁ బల్లవాంకురము లునిచి యతనియొద్ద కనిపినది. దానింజూచి యతండు నవ్వుకొనుచు.

శ్లో॥ కులప్రశ్నాకురః స్మృతః॥ నీకుల మేమని యడుగుట కిది యంకురము పంపినదని గ్రహించి యాపళ్లెరములోనే, శ్లో॥ పనసః క్షత్రియేస్మృతః || అని చెప్పఁబడినది కావున నందు రంగులతో నమరించియుంచిన పనసఫలం బొండుదీసి యాపళ్లెములోఁ బెట్టి పంపెను. తరువాత నానాతి విదియచంద్రుని గాకితముమీఁద వ్రాసియంపుటయు శ్లో॥ రాజపుత్రే ద్వితీయేందుః॥ అనియుండుటంజేసి నీవురాజపుత్రుఁడవా? అని యడిగినట్లు తెలిసికొని, శ్లో॥ ఘనచ్ఛాయస్తు భూపతిః॥ నేను కేవలము రాజుపుత్రుఁడనే కాను భూపతినని తెలియఁజేయుచు మేఘమురంగు వ్రాసియంపెను.

తరువాత నానెలఁత పోట లీప్రశ్న యడిగినది:-

శ్లో॥ సిక్థేన నిమిన్‌తా ముద్రా పంచాంగుళి సఖాంకితా
     వేష్టనం రక్త సూత్రేణ పోటలీ పరికీర్తి తా॥

“మైనము ముద్దగాఁజేసిదానిపై నైదుగోళ్లు నాటించి యెఱ్ఱదారము చుట్టి యంపినది. దానికే పోటలియని పేరు

శ్లో॥ మదనానంగతః సిక్థః సంరాగోరక్త వేష్టనం
      పంచబాణక్షతత్వేన పంచాంగుళినఖక్షతం॥