పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/327

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గొంత సదుపాయము గలిగినది. నేను గూడ మీరాజరత్నముతో గొంత ముచ్చటించెద నని పలికిన నక్కలికి సామీ! నేను మీకీపత్రికలిచ్చితినని చెప్పఁగూడదు చుఁడీ యని కోరినది. అతం డనుమ తించి బస కరిగెను.

రాత్రియెల్ల నావిషయమై ధ్యానించుచు మేము కామశాస్త్రము లన్నియు జదివితిమి. బౌద్ధయతికృతమగు నాగరసర్వస్వ మను గ్రంథములో నీనారీసాంకేతికములు వ్రాయఁబడి యున్నవికాఁబోలు. ఆగ్రంథము మేము చదువలేదు. దానంజేసి పింగళుడా ప్రశ్నముల కుత్తరము జెప్పలేకపోయెను. ఆవుస్తకమీ నగరంబున నుండకమానదు. దానిం జదివి యందలి రహస్యముల గ్రహించెదంగాక. దీని నోడించుట యెంతపని. అని యాలోచించి మఱునాఁ డావీటనున్న పుస్తకాలయముల గుఱించి వితర్కించి తెలిసికొని యొక పుస్తకభాండాగారమున కరిగి యందుగల పుస్తకముల పట్టికం జదిని యతిప్రయత్నముతో వెదకి నాగరసర్వస్వమును దీసి దాని నామూలాగ్రముగ మూడుసారులు చదివెను. అందు,

శ్లో॥ యదపిన సులభేహ సామృగాక్షీ
      సకల కళాకలనాసు పండితయా
      కధమపి యది సంగమస్తయాస్యాత్
      వ్రజతి తదాహి పరాభవం వరాక:
      అవిదిత యువతీకృతైక సాంకే
      తక ఇతి రత్నకుమారకోయదైవ.

సకలకళాపాండిత్యముగల కలకంఠితోఁ గలసికొనుటయే దుర్ఘటము. దైవవశంబున నట్టి యంగనతో సంగమము గలిగినప్పుడు యువతీకృతసాంకేతములు దెలియనివాఁ డైనచోఁ రత్నకుమారుఁడు