పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/324

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

313

గిన వాఁడు ఆమెకాదుసామి. ఆమె పనికత్తెనిమిత్తము దెచ్చితిని. ఇంటికిం బోగలదని చెప్పుచుండగనే లోపలనుండి యొకపరిచారిక వచ్చి యాబండిలోఁ గూర్చుండెను. బండి నడుచుటకుఁ బ్రారంభించినతోడనే రాజపుత్రుఁడు వెనుకం గూర్చుండెను.

ఆశకటము గడియలో దానియింటికిం బోయి నిలిచినది. రాజపుత్రుఁడు దానికన్నముందు బండిదిగి ద్వారముకడ నిలిచి యది దిగినతోడనే రత్న కేసరీ! నీనిమిత్త మిందు వేచియుంటి. వచ్చీతివా అని యడిగిన నప్పడతి తెల్లబోయి చూచుచు నతని యాకారగౌరవమునుంబట్టి యుత్తముఁడని తలంచి నమస్కరించుచు లోపలకు దయచేయుఁడని సవినయముగాఁ బలికి తీసుకొనిపోయి యొకపీఠంబునం గూర్చుండఁ బెట్టి యిట్లనియె.

అనఘా! మీరెవ్వరో గురుతుతెలియకున్నది. నన్నెఱిఁగినట్లు పల్కరించితిరి. ఇది గరువమని తలంపవలదు. నాకొఱకు వేచియుండుటకు నావలనం గాదగినపని యేదియో సెలవీయుఁడని యడిగిన మందహాసముజేయుచు నాసుందరుం డిట్లనియె.

రత్న కేసరీ! నావృత్తాంతము చాలగలదు. నన్ను నీవెఱుఁగకున్నను నిన్ను నేనెఱుంగుదును. నీసుగుణములు విని నిన్నుఁ జూడవచ్చితిని. నీవలనఁ గాఁదగినకార్య మొకటికలదు. అందులకు గానుకగా నీకీరవ్వయుంగరమిచ్చుచున్నవాఁడఁ గైకొనుమని పలుకుచుఁ గాంతులీనుచున్న యంగళీయకమొకటి దీసి దానిచేతిలోఁ బెట్టెను.

మిక్కిలివెలగల యానగం జూచి యామగువ వెఱఁగుపడుచు ఆర్యా! మీకార్యమేదియో యెఱిఁగింపుఁడు. ఓపుదేని గావించి పిమ్మట మీవలన నీకానుక నందుదాన. పనికతైనగు నన్నింతపెద్ద జేసి యగ్గింపుచుండ సిగ్గగుచున్నది. సామీ! అని యాయుంగర మీయఁబోయిన వారించుచు నతండు వలచు. నీకడనే యుంచుము నాకా