పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/323

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రకులగాఁ జేసికొనును. మఱియు నామె విద్యావిషయకములగు కొన్ని ప్రశ్నములనడిగి వానికిందగిన సమాధాన మిచ్చిన వానిఁ బ్రాణేశుఁగా జేసికొనఁగలదు. లేకున్న నామెతోటలోఁ బనిజేయవలసియున్నది యిందులకంగీకరించినవాఁడు ఒడంబడిక వ్రాసియిచ్చి లోపలకు రా వలయును.

అనియున్న పట్టము జదివికొని యారాజపుత్రుఁడు రెండుగడియలసేపాలోచించి ద్వారపాలునింజూచి యోయీ నిన్న నెవ్వరైన నీమెయిచ్చినపశ్నముల కుత్తరమిత్తుమని లోపలకుఁబోయిరా! అని యడిగిన వాఁడు ఒకచిన్నవాఁడు మీవలెనేయున్నాఁడు నిన్న వచ్చి యామెయిచ్చిన ప్రశ్నములన నెంత తృటిలోనుత్తరమిత్తునని చెప్పి లోపలికిఁబోయి తిరుగారాలేదు. తోటలోనికదేదారినిబోయెను. మొక్కలు త్రవ్వుచున్నాడని యాకథ యెఱింగించి యతండు వ్రాసియిచ్చిన పత్రికం జూపించెను.

ఔరా? ఈరాగ విద్యలలో నెంతప్రౌఢ ! మాతమ్మునిబింగళునే జయించినదియా! ఇదిమాకన్న నెక్కువజదివినది కాఁబోలు! ఏవిద్యలో నడుగునో విమర్శించిపోవలయును.

ఆహా! సకలకలానిపుణుండగు పింగళు నోడించిన యీవారాంగన పాండిత్యము కొనియాడఁ దగియున్నది. కానిమ్ము. ఇప్పుడు దీని నెట్లో జయించి తమ్ముని విడిపించుకొనిరావలయుంగదా. దీని విద్యావిశేషములెట్టివో పింగళు నేవిద్యలో బరాజితుంజేసినదియో తెలిసికొనుట అవశ్యకమైనపని. దీనిగుట్టెవ్వరివలనం దెలిసికొందునని యాలోచించుచు నెదురింటి యరుఁగుపైఁ గూర్చుండెను.

అంతలో నొకగుఱ్ఱముబండి వచ్చి యచ్చిగురుబోడి వాకిట నిలిచినది. అతం డాబండివానిని జీరి యోరీ! దీని నెవ్వరినిమిత్తము దీసికొనివచ్చితివి? రాజరత్న మెందైన విహరింవనరుగునా? అని యడి