పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/322

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజరత్నముకథ.

311

మఱునాఁడు పెందలకడ భుజించి రూపంబు దిద్దికొని చేఁత బెత్తంబుబూని విలాసముగా నడచుచు దెలిసికొని వేగముగా నడుచుచు జాముప్రొద్దువేళకు వేశ్యాంగణముజేరెను. అందు

క॥ ఒకచోట మృదంగధ్వని
     యొకచో వీణానినాద మొకచోఁ దౌర్య
     త్రికరవము వేణుగానం
     బొకచోఁదగవిని యతండహోయని పొగడెన్.

పుష్ప కేతుఁడందలి సంగీతనాదములు చెవులపండువు గావింపుచుండఁ గొండకదూరముపోయి యొక్క చో సమున్నతవేదికాభి రామంబై విచిత్రకుడ్యదీప్తంబై యభ్రంలిహాగ్రంబై బహులతాసముల్లిఖిత సింహ ద్వారకవాటంబై యొప్పు నొకసౌధరాజంబు రాజభవనమేమో యని యతనికి భ్రాంతిగలుగఁ జేసినది. వేశవాటికలోఁ బ్రాసాదము లుండునా! అనితలంచుచు సమీపమునకుఁబోయి యీమేడ యెవ్వరిదని యడిగెను.

అందుఁగాపున్న వారామాటవినిఅయ్యా! ఆగోడకువ్రేలఁగట్టిన పట్టంబుజదివికొనుడు. అంతయు మీకుఁ దెలియగలదని యుత్తరము జెప్పిరి. అతండు సంతసించుచు నఱఁగెక్కి యందలిపట్టంబు జదువ నిట్లున్నది.

మహారాజరత్నముకథ.

ఇందు మహారాజరత్నమను వేశ్యారత్నము గాపురముసేయుచున్నది. ఆయద్ధములోఁగట్టఁబడిన రూపమాయువతి ప్రతిబింబము ఈత్రిభువనైకసుందరికిఁ జతుష్షష్టికళలయందుఁ బాండిత్యము గలిగి యున్నది. ఈమెతుచ్ఛవిటతండముల షండములఁగాఁజూచుచుండును. ప్రచండ విద్యామదగర్వితుని వరింపఁగలదు. పండితంమన్యులఁ బరిచా