పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/321

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఒక్కొక్కవీధి యొక్కొకపేట పెద్దపట్టణముతోఁ బోల్చవచ్చును. ఆస్త్రీరాజ్యములో మూఁడువంతులు నగరమే వ్యాపించియున్నది. రత్నమకుటయను వనితారత్న మవ్వీడు పాలించుచున్నది.

రాజపుత్రులేవురు నప్పురంబున నొకభవనంబద్దెకు దీసికొని యందువసించిరి. పెద్దవాఁడు తమ్ములారా ! ఇన్నగర మాడుదిపాలించుచున్నదఁట. ఆమెతో మనముపోరుసేయఁగూడదుగదా!ఇందుఁగొలఁదిదినములుండి యిందలివిశేషములు సూచియవ్వలికిఁబోవుదుముగాక.ఇంతపట్టణ మిదివఱకు మనముచూచియుండలేదు. ఇందుఁబెక్కులు విచిత్రములుండకపోవు. మనము తలయొక వీధికిం బోయి చూచివచ్చుచుందుముగాక. మనమదుల కచ్చెరువుగలిగించు విశేషము లేమైనగలిగినచోఁ బరీక్షింపవలసినదియే. అని యుపదేశించిన వారనుమఁతించిరి. వారునిత్యము పెందలకడ భోజనముచేసి చక్కగా నలంకరించుకొని శృంగార శేఖరులవలె నొప్పుచు బయలు దేరి తలయొకవీధికిఁబోయి యందలివిశేషంబులుచూచిరాత్రికింటికివచ్చి యవ్వింతలొండొరులకుం జెప్పుకొనుచుందురు. ఈరీతి మూడుదివసములు జరిగినవి నాలుగవనాఁడు పుష్ప కేతుఁడమాత్ర మింటికివచ్చెను. తక్కినవా రెవరును రాలేదు. చీఁకటిపడినది పుష్ప కేతుఁడు బరితపించుచుఁ దమ్ములజాడ జూచుచుఁ బెద్దడవువీధిలోనే కూరుచుండెను. ఒక్కండును రాలేదు.

అప్పుడతండాలోచించుచు నిన్న రాత్రి పింగళుఁడు మాటల ధోరణిలో నీవీట వేశవాటిక చాల పెద్దదనియు నందలిబోటులుమంచి నీటుకత్తెలనియుఁ జెప్పియున్నాఁడు నేఁడక్కడికిఁబోయి యుందురా? అయ్యో ! అందుబోవలదని చెప్పవలసినది. ఆవెలయాండ్రు వీరినేమి మోసముజేసిరో? మాకిదిక్రొత్తదేశము కానిమ్ము. ఆమహావీరులవార లేమిజేయగలరు? వలపుగలుగఁజేసి చిక్కపట్టినంబట్టుదురుగాక రేపు పోయి పరిశీలించెదనని తలఁచుచు నారాత్రియెల్ల నిద్రబోవడయ్యెను.