పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/317

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నాదారిని గన్యాకుబ్జమునకు రమ్మని వార్తననిపి శుభముహూర్తంబున హరివర్మాదులు దలంచినంతనే దేవకన్యలతో గూడ సన్నిహితమగు రత్న విమానముపై వారెల్లభార్యలతో నెక్కిమహావైభవముతో గగనమార్గంబునఁ బుష్పకారూఢుం డగు శ్రీరాముఁడువోలె జనుచుఁ దొలుతనుమాపురంబున కరిగిరి.

అందొకచో విమానమునిలిపి హరివర్మయల్లన శ్రీధరుని కోటలోనికిం జనియెను. అతండు శ్రీముఖుని తమ్ముండని యెఱింగిన వారెల్ల వడివఁడి బరుగిడికొనిపోయి యావార్త శ్రీధరుని కెఱింగించిరి. శ్రీధరుం డతని కెదురువచ్చి ప్రీతిచే నాలింగనము జేసికొని రాజపుత్రా! మీతమ్ములేరి! అందరు సుఖముగా వచ్చితిరా? అని యడిగిన నతండు మీ యనుగ్రహమున సేమముగానే వచ్చితిమి. మాయన్న శ్రీముఖుఁ డిందుఁ గుశలియై యున్న వాఁడా యని యడిగిన నా రాజిట్లనియె.

రాజపుత్రా! నిన్నొకమాట నడిగెదఁ జెప్పుము. మీరుసముద్రములో నరుగుచుండ నోడలన్నియుఁ గనులకుఁ దగిలి వికలములై మునిగినవనియు, మీరందుఁబడి మృతినొందితిరనియు మాకు వార్తలు వచ్చినవి. మీ రెట్లు బ్రతికి వచ్చితిరో తెలుపుమని యడిగిన నతండు సంక్షేపముగా దమకథ నెఱింగించి యతని కానందము గలుగఁ జేసెను.

రాజు విస్మయపడి అయ్యో! పాపము! మీయన్న మీ మరణవార్త విని మిక్కిలి దుఃఖించుచు అక్కటా! క్రోధనుని యంత్రబలసామర్థ్యము వినియుం దమ్ములబంచి బలవంతమున జంపికొంటి. నావంటి దుర్మార్గుం డెవ్వఁడైనఁ గలఁడా? అయ్యో! నేనత్త వారింట విందులు గుడుచుచుఁ దమ్ములతోఁ బోలేక నిలిచితినే. నేనొక్కరుండ నింటి కెట్లు పోవుదును? తమ్ములేరని యడిగిన మాతల్లి కేమి