పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/316

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

303

పాశబద్ధులమగుట లోకమును జింతాపరంపరలు తాకఁకమానవు. వరుణావతీనగరంబునఁ గ్రోధనుండను మహారాజు నాభార్యకు అక్కమగఁడు అతనిభార్య చెల్లెలి పరిదేవనమువిని మమ్మక్కడికిఁ దీసికొనిరమ్మని నమ్మకమగు భృత్యులనంపినది వారివెంట మేమందుబోవుచున్నాము ఈక్షేత్రం బతిపవిత్రమైనదగుట మూడునాళ్ళు వసించితిమి. రేపు ఓడలెక్కిపోవుదుము మీరు లోకైకవీరులని చెప్పగావిని చూడవచ్చితి నని యారాజు తనకథయంతయుఁ జెప్పెను. ఆకథవిని మే మొకరిమొకము చూచుకొనఁ దొడఁగితిమి. అప్పుడు హరివర్మలేచి యో హో హో! అవంతీశ్వరుఁడవా నీవు! దైవసంఘటన మతివిచిత్రమైనది గదా. మీకూతురు చారుమతి కుశలినియైయున్నది. మీకిందుఁ జూపింతు నా కేమి పారితోషిక మిత్తురని యడిగిన నమ్మహారాజిట్లనియె.

మహాభాగ!నీవనినమాట సత్యమగుంగాక. అట్లైన నా రాజ్యమే నీకుఁ బారితోషికముగానిత్తు. ఏదీ? ఎందున్నదియో చెప్పుఁడు చెప్పుఁడు అనియూరక యున్మత్తునిచందమున నడుగుచుండ మనహరివర్మమామా! నేను నీయల్లుఁడ చారుమతి నన్ను వరించినది. అని తమకథసంక్షేపముగాఁ జెప్ప విని యమ్మహీపతిబొందిన యానందమిట్టిదని చెప్పుటకు మాతరముకాదు.

హరివర్మంగౌఁగలించుకొని యేదీనానందనియేదీ చూపుదువా? అని యడిగిననతఁడు నాతోరమ్ము చూపింతునని పలుకుచు నొకపట కుటీరమునకుఁ దీసికొనిపోయి చారుమతింజీరి నీతలిదండ్రులు వచ్చి యున్నారనిచెప్పెను. అప్పుడప్పడఁతి ముప్పిరిగొను వేడుకతో వారిం గాంచినది పుత్రికఁజూచి వారుమాటాడలేక హా తల్లీ ! నీవు బ్రతికి వచ్చితివా! అనిపలుకుచుశోకగద్దదకంఠుడై యక్కునంజేర్చి పెద్దతడవు గారవించిరి.